• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మంత్రి ట్విస్టు, ఎమ్మెల్యే చిచ్చు: విలీనంలో రాజీ పడేదెవరు?

|

చెన్నై: దాదాపు రెండు నెలల తర్వాత అన్నాడీఎంకె వైరి వర్గాలు రెండూ స్నేహపూర్వక వాతావరణంలో పార్టీ ప్రధాన కార్యాలయంలోకి అడుగుపెట్టబోతున్నాయి. ఎన్నికల కమిషన్ కి లంచం ఇవ్వజూపి పార్టీ పరువును టీటీవి దినకరన్ బజారుకీడ్చేయడంతో.. రెండు వర్గాలు ఒక్కటై పార్టీ నుంచి ఆయనతో పాటు శశికళను తరిమికొట్టాయి.

ఇక తమలో తమకు నెలకొన్న అనిశ్చితి వివాదాలను కొలిక్కి తీసుకొచ్చి.. పార్టీని ఒక్క తాటిపై నడిపేందుకు మాజీ సీఎం పన్నీర్ సెల్వం, ప్రస్తుత సీఎం పళనిస్వామి ఆధ్యర్యంలో నేడు చర్చలు మొదలుకానున్నాయి. సాయంత్రం వరకు ఈ చర్చల వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు సీఎం పోస్టు కావాలంటూ పన్నీర్ సెల్వం పట్టుబడుతుండటంతో.. ఆయనకు పళనిస్వామి ఎలా నచ్చజెప్పుతారు? లేక పదవుల కోసం పన్నీర్ సెల్వం పళనిస్వామిపై మరింత ఒత్తిడి తెస్తారా? అన్నది ఈ భేటీపై ఉత్కంఠను రేకెత్తిస్తోన్న అంశం.

రాయపేటలో విలీన చర్చలు:

రాయపేటలో విలీన చర్చలు:

సోమవారం నాడు రాయపేటలోని అన్నాడీఎంకె ప్రధాన కార్యాలయంలో ఓపీఎస్(పన్నీర్ సెల్వం), ఈపీఎస్(ఎడపాడి పళనిస్వామి) వర్గాల మధ్య సామరస్యపూర్వకంగా చర్చలు జరగనున్నాయి. పార్టీలో, ప్రభుత్వంలో ఎవరు ఎలాంటి బాధ్యతలు పోషించాలి అన్న దానిపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఇప్పటివరకు ఇరు వర్గాల మధ్య మీడియా ముఖంగా జరిగిన వెలువడిన ప్రకటనలే తప్ప.. ప్రత్యక్ష భేటీ జరగలేదు. తొలిసారి నేడు భేటీ జరగనుండటంతో భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.

ట్విస్ట్.. మంత్రి రాజీనామా:

ట్విస్ట్.. మంత్రి రాజీనామా:

ఓపీఎస్-ఈపీఎస్ రెండు వర్గాలు విలీనమైతే.. పార్టీలోను, ప్రభుత్వంలోను కొన్ని సర్దుబాటు చర్యలు తప్పవు. పన్నీర్ వర్గం నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కేబినెట్ లోకి వచ్చే అవకాశం ఉండటంతో.. వారికి స్థానం కల్పించడం కోసం తాము త్యాగాలకు సిద్దమంటున్నారు ఈపీఎస్ వర్గ మంత్రులు.

తాజాగా ఆర్థికమంత్రి డి.జయకుమార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పన్నీర్ సెల్వం వర్గంలోని ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే కొన్ని త్యాగాలు తప్పవని, అందుకే.. తొలుత తానే రాజీనామా చేస్తున్నాని ప్రకటించారు.

మరో మంత్రి స్పందన వేరేలా:

మరో మంత్రి స్పందన వేరేలా:

ఆర్థికమంత్రి జయకుమార్ స్పందన అలా ఉంటే, మరో మంత్రి దిండిగల్ శ్రీనివాసన్ మాత్రం దానికి భిన్నంగా స్పందించారు. మెజారిటీ ఉన్న ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం పూర్తి కాలం కొనసాగుతుందన్నారు. నేటి భేటీలోను ఇలాంటి భిన్నాభిప్రాయాలే గనుక వ్యక్తమైతే పన్నీర్ సెల్వంకు సీఎం పోస్టు దక్కడమే కష్టమే.

పళనిస్వామి రాజీ మంత్రం:

పళనిస్వామి రాజీ మంత్రం:

పన్నీర్ సెల్వంను ఎలాగైనా రాజీపడేలా చేయాలని సీఎం పళనిస్వామి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పార్టీ కోశాధికారి పోస్టును ఆయన ఆఫర్ చేస్తున్నారు. ఇక పార్టీ ప్రధాన కార్యదర్శిగా అన్నాడీఎంకె సీనియర్ నేత వైద్యలింగాన్ని నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఈ ప్రతిపాదనకు పన్నీర్ వర్గం ఒప్పుకోకపోతే గనుక.. పార్టీలో రెండు ప్రధాన కార్యదర్శులు ఏర్పరిచి, రెండు వర్గాలు తలొకటి పంచుకోవాలనేది పళనిస్వామి ఆలోచనగా తెలుస్తోంది.

ఎమ్మెల్యే సెంథిల్ చిచ్చు:

ఎమ్మెల్యే సెంథిల్ చిచ్చు:

ఈపీఎస్ వర్గంలో భిన్నాభిప్రాయాలు చాలానే వినిపిస్తున్నాయి. ఒకరేమో త్యాగాలకు సిద్దమని ప్రకటిస్తే.. మరొకరు మెజారిటీ ఉన్నందునా తమ ప్రభుత్వమే కొనసాగుతుందంటున్నారు. ఇక మరో ఎమ్మెల్యే సెంథిల్ కుమార్ వాదన మరోలా ఉంది.

అంతా మీరే నిర్ణయించుకుంటే ఇక ఎమ్మెల్యేలు ఎందుకు? ఆయన ప్రశ్నిస్తున్నారు. 122మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపబట్టే సీఎం సహా మంత్రులంతా పదవులను అనుభవిస్తున్నారన్న సంగతి గుర్తెరగాలన్నారు. పార్టీ శాసనసభాపక్షం నిర్ణయం మేరకే శాసనసభాపక్ష నేత ఎంపిక సాగాలని, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న వ్యక్తినే సీఎం చేయాలని అన్నారు.

అంతేకాదు, డిప్యూటీ స్పీకర్ తంబిదురై, రవాణా మంత్రి ఎంఆర్ విజయ్ భాస్కర్ లకు వ్యతిరేకంగా దీక్షకు దిగుతానని సెంథిల్ కుమార్ ప్రకటించడం గమనార్హం.

English summary
The warring O Panneerselvam and E Palaniswami camps within the AIADMK are ready with a truce plan which will seal the merger of the two factions of the party that currently governs Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X