వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో పన్నీర్ వర్గం దూకుడు: పిచ్చి చేష్టలతో శశికళ వర్గానికి అడుగు పెట్టాలంటే హడల్ !

పన్నీర్ సెల్వం వర్గం దూకుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి చిక్కుల్లో పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు పన్నీర్ సెల్వం వర్గం తమకు అనుకూలంగా కొన్ని వేల అఫిడవిట్లను ఎ

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గీయులు ఢిల్లీలో మాకం వేశారు. అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం ఎలాగైనా సొంతం చేసుకోవాలని పక్కా ప్లాన్ వేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు 12,500 పేజీల అఫిడవిట్లు సమర్పించారు.

సీఎం పళనిసామి సెంచరీ, నాటౌట్: పన్నీర్ పేరు వినపడకుండా ప్లాన్, మోడీ జపం !సీఎం పళనిసామి సెంచరీ, నాటౌట్: పన్నీర్ పేరు వినపడకుండా ప్లాన్, మోడీ జపం !

సోమవారం తాజాగా ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అనేక అఫిడవిట్లు సమర్పించారు. రెండాకుల చిహ్నం మాకే ఎందుకు ఇవ్వాలి అనే విషయంపై సంపూర్ణంగా వివరణ ఇస్తూ అఫిడవిట్లు సమర్పించిన పన్నీర్ సెల్వం వర్గీలు హుషారుగా బయటకు వచ్చారు.

పన్నీర్ సెల్వం దూకుడు

పన్నీర్ సెల్వం దూకుడు

పన్నీర్ సెల్వం వర్గం దూకుడుతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి చిక్కుల్లో పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు పన్నీర్ సెల్వం వర్గం తమకు అనుకూలంగా కొన్ని వేల అఫిడవిట్లను ఎన్నికల కమిషన్ కు ఇచ్చింది.

సీఎం పళనిసామికి చిక్కులు !

సీఎం పళనిసామికి చిక్కులు !

పన్నీర్ సెల్వం దెబ్బతో ఎడప్పాడి పళనిసామికి మరన్ని చిక్కులు ఎదురైతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ కు సరైన అఫిడవిట్లు సమర్పించడంలో పళనిసామి వర్గీయులు విఫలం అయ్యారని తెలిసింది.

జైల్లో శశికళ, దినకరన్

జైల్లో శశికళ, దినకరన్

అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో చిన్నమ్మ శశికళ నటరాజన్ శిక్ష అనుభవిస్తున్నారు. ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేశారని ఆరోపిస్తూ ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు టీటీవీ దినకరన్ ను అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించారు.

ఎవరు పట్టించుకుంటారు ?

ఎవరు పట్టించుకుంటారు ?

న్యాయనిపుణుల సలహాలు, సూచనల మేరకు పన్నీర్ సెల్వం అనేక అఫిడవిట్లు ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. రెండాకుల చిహ్నం మాకేకావాలని ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు. అయితే శశికళ వర్గంలో గత కొంత కాలం క్రితం వరకు రెండాకుల చిహ్నం సొంతం చేసుకోవడానికి ప్రయత్నించిన దినకరన్ జైలుకు వెళ్లడంతో ఇప్పుడు ఆ విషయం పట్టించుకునే నాథుడే కరువయ్యాడని సమాచారం.

లాభం లేదు, డబ్బు ఖర్చు విషయంలో ?

లాభం లేదు, డబ్బు ఖర్చు విషయంలో ?

న్యాయనిపుణలను సంప్రందించి అఫిడవిట్లు తయారు చెయ్యాలంటే భారీ మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం ఉందని, ఇప్పుడు ఆ డబ్బు ఎవరు ఖర్చు పెడుతారు ? అంటూ శశికళ వర్గంలోని నాయకులు మౌనంగా ఉంటున్నారని తెలిసింది.

రెండాకుల చిహ్నం చెయ్యిజారితే ?

రెండాకుల చిహ్నం చెయ్యిజారితే ?

రెండాకుల చిహ్నం చెయ్యి జారిపోతే పరిస్థితి వేరుగా ఉంటుందని శశికళ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు. అయితే డబ్బు ఖర్చు పెట్టి ఢిల్లీ తిరగడానికి శశికళ వర్గీలు వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఎలాగైనా శశికళ వర్గాన్ని దెబ్బ కొట్టాలని పన్నీర్ సెల్వం వర్గం దూకుడుగా వ్యవహరిస్తోంది.

దినకరన్ పిచ్చిచేష్టలతోనే !

దినకరన్ పిచ్చిచేష్టలతోనే !

ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్ల లంచం ఎర వెయ్యడానికి ప్రయత్నించిన టీటీవీ దినకరన్ జైలుకు వెళ్లాడు. దినకరన్ పిచ్చి చేష్టలతో ఇప్పుడు ఎన్నికల కమిషన్ కార్యాలయంలో అడుగుపెట్టాలంటే శశికళ వర్గీయులు హడలిపోతున్నారు. ఎక్కడ ఏ కేసు వచ్చి మీద పడుతుందో అంటూ వెనకడుగు వేస్తున్నారని సమాచారం.

English summary
Tamil Nadu former CM Panneerselvam Team has submitted more documents at Election commission related to AIADMK symbol.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X