• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పట్టణ యువతకు కాస్త మెరుగు-గ్రామీణ యువతలో అవే వెతలు

|

ముంబై: ఎన్నికల బరిలో దిగిన అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో కనిపించే అంశం..ఉద్యోగం, ఉపాధి అవకాశాలు. బాబు వస్తేనే జాబు వస్తుందంటూ 2014 ఎన్నికల్లో ఊదరగొట్టింది తెలుగుదేశం పార్టీ. ఏటా కోటికి పైగా ఉద్యోగాలను ఇస్తామంటూ నమ్మించింది భారతీయ జనతాపార్టీ. ఈ రెండు పార్టీలు కూడబల్లుక్కుని హామీల మీద హామీలు ఇచ్చేశాయి. ఓట్లను కొల్లగొట్టాయి. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాయి. హామీలు నెరవేర్చాయా? అంటే లేదనే చెబుతున్నాయి సర్వేలు. బాబు వస్తేనే జాబు వస్తుందంటూ ప్రచారం చేసిన చంద్రబాబు.. తాను అధికారంలోకి వచ్చిన తరువాత తన కుమారుడు లోకేష్ కు మంత్రివర్గంలో చోటు కల్పించి, ఆయనకు జాబు ఇచ్చాడనే విమర్శలు ఉన్నాయి.

ఏటా కోటి ఉద్యోగాల హామీలు ఇచ్చిన బీజేపీ పరిస్థితి కూడా దీనికేమీ తీసిపోవట్లేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలినంత లేవనే అసంతృప్తి దేశీయ యువతలో వ్యక్తమౌతోంది. ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తేలింది. యుగోవ్-మింట్ సంయుక్తంగా చేసిన సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా 180 నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల నుంచి ఆన్ లైన్ ద్వారా ఈ సర్వే నిర్వహించారు.

గ్రామీణ యువత కంటే పట్టణాల్లో నివసించే వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయని ఈ సర్వేలో తేలిందట. 19 నుంచి 22 సంవత్సరాల వయస్సున్న వారిని ఓ కేటగిరీగా, 22 నుంచి 29 సంవత్సరాల వయస్సున్న వారిని మరో కేటగిరీ కింద విభజించి.. ఈ సర్వే చేపట్టారు.

నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Optimism about jobs rises among Indias youth

సర్వే చేపట్టిన జనవరి నాటి నుంచి ఆరునెలల కిందటి పరిస్థితులతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉపాధి అవకాశాలపై దాదాపు అన్ని వర్గాలు, విభిన్న వయస్సున్న వారి నుంచి మిశ్రమ స్పందన వెలువుడింది. ఆరునెలల కిందటితో పోల్చుకుంటే ప్రస్తుత పరిస్థితులు మెరుపడ్డాయని పట్టణ యువత చెబుతోంది. గ్రామాలు, ఓ మోస్తరు పట్టణ స్థాయి యువతకు ఆ మాత్రం అవకాశాలు కూడా లేవని తేలింది. 19 నుంచి 22 మధ్య వయస్సున్న యువత 43 శాతం, 23 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సున్న యువత 45 శాతం మేర తమ అభిప్రాయాలను వ్యక్త పరిచారు. ఉపాధి అవకాశాలపై ఇదే ఆరునెలల కాలంలో ఉద్యోగ అవకాశాలపై 21 శాత మంది 30-38 మధ్య వయస్సున్న వారు. 39 నుంచి 54 ఏళ్ల వయస్సున్న వారు 27 శాతం మంది నుంచి మిశ్రమ స్పందనే వచ్చింది.

డిసెంబర్ 31వ తేదీ నాటికి ముగిసిన మూడో ఆర్థిక త్రైమాసికంలో రిజర్వుబ్యాంకు విడుదల చేసిన నివేదికలోనూ.. ఉద్యోగ అవకాశాలు కొద్దిగా మెరుగు పడిందనే విషయం స్పష్టమైందని సర్వే అభిప్రాయపడింది. ఐటీ రంగం, సాఫ్ట్ వేర్ సంస్థల్లో మాత్రమే ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని, అధిక శాతం మంది యువత అభిప్రాయపడ్డారు. తయారీ, సేవా రంగం పరిస్థితుల్లో పెద్దగా మార్పు రాలేదని వెల్లడైంది. తయారీ, సేవారంగాల్లో ఉద్యోగం లభించడం కష్టమని వారు తెలిపారు.

మహిళలకే ప్రాధాన్యత

అందుబాటులో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో యువతులకు ప్రాధాన్యత పెరిగిందని యుగోవ్-మింట్ సర్వే స్పష్టం చేసింది. ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు, తయారీ, సేవా రంగాల్లో అందుబాటులో ఉండే ఉద్యోగాలు యువతులతో త్వరితగతిన లభిస్తున్నాయని తేలింది. పురుషులకు ఉద్యోగాలు లభించడం కష్టతరమైందని సర్వేలో పేర్కొన్నారు. అప్పుడే చదువులు ముగించుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్న 19-23 ఏళ్ల లోపు యువతులకు సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయట. ఈ కేటగిరీలో 16 శాతం మంది తమకు వెంటనే ఉద్యోగాలు లభిస్తున్నాయని అభిప్రాయపడగా.. 12 శాతం మంది పెదవి విరుస్తున్నారు. ఇదే కేటగిరీలో ఉన్న 30-38 ఏళ్ల వయస్సున్న ఆశావహుల్లో ఎనిమిది శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు. 19-23 మధ్య వయస్సున్న లోపు యువతకు తక్కువ వేతనాలతో కూడిన (ఎంట్రీ లెవెల్) ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లభిస్తున్నాయని సర్వే స్పష్టం చేసింది.

English summary
According to survey data collected by market researcher YouGov in collaboration with Mint, more urban youth believe it is easier to find a job now compared to six months ago. About 43% of the Gen-Z (19- to 22-year-olds) and 45% of younger millennials (23- to 29-year-olds) think it is "somewhat" to "extremely" easy to find a job nowadays.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X