వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్‌కు కాషాయరంగు..? భగ్గుమంటున్న విపక్షాలు

|
Google Oneindia TeluguNews

ముంబై: ఇప్పటి వరకు పార్టీల వరకే పరిమితమైన రాజకీయాలు ఇప్పుడు క్రమంగా క్రీడలకు పాకుతున్నాయి. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న వరల్డ్ కప్‌లో భారత్ ఈ నెల 30న ఇంగ్లాండ్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియా ఆటగాళ్లు ఆరెంజ్ జెర్సీని ధరించనున్నారు. కాషాయం జెర్సీని ధరించడాన్ని మహారాష్ట్ర ముస్లిం ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అదేసమయంలో ఖండిస్తున్నారు.

సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అబు అసిమ్ ఆజ్మి అనే ముస్లిం సామాజికవర్గం ఎమ్మెల్యే...ఆటగాళ్లు కాషాయం జెర్సీ ధరించాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కాషాయరంగును బీజేపీ ప్రమోట్ చేస్తోందని చివరకు క్రీడాకారులచేత కూడా ఆరంజ్ జెర్సీని ధరింపజేస్తోందని మండిపడ్డారు. దేశాన్ని కాషాయ రంగులో ముంచెత్తడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని, భారత జెండాలో ఉండే మూడురంగులను ఒక ముస్లిం వ్యక్తి రూపొందిచారని... మూడు రంగులు ఉన్న జెండాలో ఒక్క కాషాయం రంగునే ఎందుకు ఎంచుకున్నారని అజ్మీ ప్రశ్నించారు. జెర్జీ మూడు రంగుల్లో ఉంటేనే బాగుంటుందని చెప్పారు.

Recommended Video

ఇక పై సినిమా థియేటర్లలో క్రికెట్
Orange Jersey for Indian cricketers takes a political turn, Muslim Mlas oppose

మోడీ ప్రభుత్వం కాషాయ రాజకీయాలకు తెరలేపిందని మాజీమంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీం ఖాన్ అన్నారు. మోడీ సర్కార్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కాషాయరంగు రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. మూడురంగులను గౌరవిస్తూనే జాతి సామరస్యతను ప్రమోట్ చేయాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే క్రీడాకారులు ఆరంజ్ జెర్సీని ధరించడాన్ని కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే సమర్థించారు. ధైర్యం విజయానికి కాషాయరంగు సంకేతమని తెలిపారు. కాషాయ రంగు ధరించడంపై ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వెల్లడించారు.

జూన్ 30న ఇంగ్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో భారత్‌ కాషాయరంగు జెర్సీని ధరించనుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం ఆతిథ్య దేశం కాకుండా ఇతర దేశాలు రెండు రంగులతో కూడిన జెర్సీలు ధరించాలంటే ముందస్తు అనుమతి ఉండాలి. ప్రస్తుతం భారత్, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు ధరించే జెర్సీ నీలంరంగులో ఉన్నాయి. ఇందుకోసమే భారత క్రీడాకారులు కాషాయ రంగు జెర్సీని ధరించనున్నారు.ఇక ఐసీసీ బీసీసీఐకి కొన్ని కలర్స్‌ను ప్రతిపాదించగా... బీసీసీఐ కాషాయంను కోరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాషాయ రంగు జెర్సీలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

English summary
The Congress and Samajwadi Party have opposed the orange jerseys that will be sported by the Indian cricket team when they play against England in the 2019 World Cup match on June 30.Muslim MLAs in the Maharashtra state assembly condemned the orange jersey that will be donned by Team India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X