• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్విస్ట్: వ్యాక్సిన్ ధరలు కంపెనీల ఇష్టం -రాష్ట్రాలే ప్రైవేటుకు సరఫరా -44కోట్ల డోసులకు ఆర్డరిచ్చాం: కేంద్రం

|

దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసిన 24 గంటల్లోనే భారీ ఎత్తున 44 కోట్ల వ్యాక్సిన్ డోసులకు కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. జులై తర్వాత దేశంలో అసలు టీకాల కొరత అనేదే ఉండదని సర్కారు ధీమా వ్యక్తం చేసింది. అయితే, వివాదాస్పదంగా మారిన ప్రైవేటుకు 25శాతం టీకాల అంశంలో కేంద్రం మరో పిల్లిమొగ్గ వేసింది. దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలిచ్చే బాధ్యత కేంద్రానిది అంటూనే ప్రైవేటు ఆస్పత్రులకు సరఫరా చేసే వ్యాక్సిన్ల ధరలను కంపెనీలే నిర్ణయించుకుంటాయని, ప్రభుత్వ జోక్యం ఉండబోదని తెలిపింది. వివరాలివి..

వ్యాక్సిన్లు ఉచితమైతే ప్రైవేటుకు రూ.150 ఎందుకు?: రాహుల్ ప్రశ్న -ఆలస్యం ఖరీదు లక్షల ప్రాణాలన్న మమతవ్యాక్సిన్లు ఉచితమైతే ప్రైవేటుకు రూ.150 ఎందుకు?: రాహుల్ ప్రశ్న -ఆలస్యం ఖరీదు లక్షల ప్రాణాలన్న మమత

44 కోట్ల డోసులకు ఆర్డర్..

44 కోట్ల డోసులకు ఆర్డర్..

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకా వేయించే బాధ్యత తమదేనని, ఈ నెల 21 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వ సారధి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాటి సందేశంలో స్పష్టం చేశారు. ప్రధాని ప్రకటనకు ఫాలోఅప్ గా కేంద్రం మొత్తం 44 కోట్ల డోసుల టీకాలకు ఆర్డర్ పెట్టిందని ఆరోగ్య శాఖ అధికారులు, నీతి ఆయోగ్ (హెల్త్) మెంబర్ డాక్టర్ వీకే పాల్ మంగళవారం మీడియాకు తెలిపారు. కేంద్రం ఆర్డర్ పెట్టిన వ్యాక్సిన్లలో 25కోట్ల డోసులు కొవిషీల్డ్ కాగా, 19 కోట్ల డోసులు కొవగ్జిన్‌వి. అంతేకాదు,

జగన్‌కు ఎన్డీఏ షాక్?: రఘురామకు బిహార్ సీఎం మద్దతు! -ఫోన్ బెదిరింపులపై ఏపీ సీఐడీ కీలక వివరణజగన్‌కు ఎన్డీఏ షాక్?: రఘురామకు బిహార్ సీఎం మద్దతు! -ఫోన్ బెదిరింపులపై ఏపీ సీఐడీ కీలక వివరణ

ఇక వ్యాక్సిన్ల కొరత రాదు..

ఇక వ్యాక్సిన్ల కొరత రాదు..


సీరం సంస్థ వారి కొవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారీ కొవాగ్జిన్ కలిపి మొత్తం 44 కోట్ల డోసుల టీకాలకు ఆర్డర్ ఇవ్వడంతోపాటు టీకాల సేకరణ కోసం ఈ రెండు సంస్థలకు అదనంగా 30శాతం అడ్వాన్సు విడుదల చేసినట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించింది. ఇక, కార్బివాక్స్‌ టీకా 30కోట్ల డోసుల కోసం బయోలాజికల్‌ -ఇ సంస్థకు కూడా విడిగా మరో ఆర్డర్‌ పెట్టామని, ఆ 30 కోట్ల డోసులు సెప్టెంబర్‌ కల్లా అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. జులై చివరినాటికి భారత్ మొత్తం 53.6కోట్ల టీకా డోసులను వినియోగించినట్లవుతుందని, కొత్తగా పెట్టిన ఆర్డర్లన్నీ అందుబాటులోకి వస్తే, ఆగస్ట్-సెప్టెంబర్ నాటికి టీకాల కొరత అంటూ లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుందని డాక్టర్ పాల్ తెలిపారు. ఇక,

ధరల నిర్ణయాధికారం కంపెనీలదే

ధరల నిర్ణయాధికారం కంపెనీలదే

ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన 32 నిమిషాల సందేశంలో ‘‘ప్రైవేటు ఆస్పత్రులకు 25 శాతం టీకాల వాటా'' అంశం ప్రశ్నార్థకంగా, వివాదాస్పదంగా మారింది. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతాన్ని కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తామని, ఇందు కోసం రాష్ట్రాలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని, అయితే, ఉచితంగా వద్దనుకొనేవారి కోసం 25% వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా అందింస్తామని ప్రధాని చెప్పారు. ఓవైపు అందరికీ వ్యాక్సిన్లు ఉచితం అంటూనే ప్రైవేటుకు 25శాతం టీకాల కేటాయింపు, రూ.150 సర్వీస్ చార్జి విధింపు ఎంతవరకు సమంజసం? అని విపక్షాలు ప్రశ్నించాయి. అందుబాటులోకి రానున్న వ్యాక్సిన్లన్నీ ప్రైవేటుకే తరలివెళతాయని, అప్పుడు నిరుపేదలకు టీకాలు అందని ద్రాక్షలా మారుతాయని విపక్ష నేతల వాదన. ఈ వాదనకు మరింత బలం చూకూర్చుతూ ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన 25 శాతం టీకాల ధరలను ఆయా కంపెనీలే నిర్ణయిస్తాయని కేంద్రం వెల్లడించింది.

ప్రైవేటుకు సప్లై బాధ్యత రాష్ట్రాలపై?

ప్రైవేటుకు సప్లై బాధ్యత రాష్ట్రాలపై?

దేశంలో తయారయ్యే టీకాల్లో 25 శాతాన్ని ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు అందజేస్తామని ప్రధాని మోదీ వెల్లడించిన నేపథ్యంలో.. ప్రైవేటుకు ఇచ్చే వ్యాక్సిన్ల ధ‌ర‌ల‌ను ఆయా వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారులే నిర్ణ‌యిస్తార‌ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. అంతేకాదు, ప్రైవేటు హాస్పిట‌ళ్ల‌కు కావాల్సిన వ్యాక్సిన్ డోసులు, పంపిణీ తదితర వ్యవహారాలను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌రిశీలిస్తాయ‌ని, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంత వ‌ర‌కు స‌దుపాయాలు ఉన్నాయ‌ని, ఎన్ని డోసులు అవ‌స‌రం వ‌స్తుందో ఆయా రాష్ట్రాలే నిర్ణ‌యిస్తాయ‌ని కూడా డాక్టర్ పాల్ చెప్పారు. దీంతో..

టీకాలు ఉచితమైతే ప్రైవేటుకు డబ్బులెందుకు?

టీకాలు ఉచితమైతే ప్రైవేటుకు డబ్బులెందుకు?

ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాలు లేకపోవడం, ప్రైవేటులో మాత్రం అధిక ధరకు అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్థితే రాబోయే రోజుల్లోనూ కొనసాగుతుందని, 25 శాతం టీకాలను ప్రైవేటుకు కేటాయించడం సరికాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ‘‘మోదీ చెప్పినట్లు అందరికీ టీకాలు ఉచితమైనప్పుడు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ధరలెందుకు పెట్టారు?'' అని రాహుల్ గాంధీ నిలదీశారు. కేంద్రం తాజా ప్రకటనను బట్టి, ఫార్మా కంపెనీలు తమ వ్యాక్సిన్ల ధరలను సవరించే అవకాశాలున్నాయి. గతంలో కేంద్రానికి ఒక రేటు, రాష్ట్రాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు వేర్వేరు రేట్లు నిర్ధారించగా, ఇప్పుడు రాష్ట్రాల పాత్ర లేదు కాబట్టి, ప్రైవేటుకు ఇచ్చే టీకాల ధరలను కంపెనీలే నిర్ణయిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. మరి కేంద్రానికి ఆయా కంపెనీలు ఎంత రేటుకు సరఫరా చేస్తాయనేదానిపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ క్లారిటీ ఇవ్వలేదు.

English summary
The price of COVID vaccines to private sectors (hospitals) will be decided by vaccine manufacturers, informed Member (health) NITI Aayog Dr VK Paul on Tuesday. The government also said it has placed an order of 44 crore COVID-19 vaccine doses. This includes 25 Crore Covishield from Serum Institute of India and 19 Crore doses of Covaxin from Bharat Biotech, the government said. government has also placed an order to purchase 30 crore doses of Biological E's vaccine, which will be available by September, says VK Paul.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X