వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్డినెన్స్‌కు ఆమోదం, అయినా నిరసనలు: నేడు జల్లికట్టు

జల్లికట్టు కోసం తమిళ ప్రజలు చేసిన ఉద్యమం ఫలించింది. జల్లికట్టు నిర్వహణకు అనుకూలంగా తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాన్ని (ఆర్డినెన్స్‌) గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర రావు శనివారం ఆమోదించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జల్లికట్టు కోసం తమిళ ప్రజలు చేసిన ఉద్యమం ఫలించింది. జల్లికట్టు నిర్వహణకు అనుకూలంగా తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాన్ని (ఆర్డినెన్స్‌) గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర రావు శనివారం ఆమోదించారు.

జల్లికట్టు-త్రిష ఎఫెక్ట్: రంగంలోకి శశికళ, పన్నీరు సెల్వంకు షాక్జల్లికట్టు-త్రిష ఎఫెక్ట్: రంగంలోకి శశికళ, పన్నీరు సెల్వంకు షాక్

దీంతో జల్లికట్టు నిర్వహణకు మార్గం సుగమమైంది. జల్లికట్టుకు ఖ్యాతిగాంచిన మధురై జిల్లాలోని అలంగానల్లూరులో ఆదివారం ఉదయం ఈ క్రీడను నిర్వహించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. సీఎం పన్నీరు సెల్వం ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అలంగానల్లూరులో జల్లికట్టును ఆరంభించడానికి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శనివారమే మదురైకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌తో జల్లికట్టు నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయన్నారు. ఆరు నెలలపాటు ఈ అత్యవసర ఆదేశం అమలులో ఉంటుందని, ఆలోగా దీన్ని శాశ్వత చట్టంగా చేయవలసిన అవసరం ఉందన్నారు.

జల్లికట్టు ఆర్డినెన్స్‌ విషయంలో సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. మరోవైపు ప్రధాని మోడీ.. తమిళుల సమున్నత సాంస్కృతిక ఆకాంక్షలు తీర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని ట్వీట్‌ చేశారు.

జల్లికట్టు కోసం రాష్ట్రం ప్రతిపాదించిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు కొద్దిపాటి మార్పులతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఆమోదించి, రాష్ట్రానికి పంపించింది. జంతుహింస నిరోధక చట్టంలో సవరణలు తీసుకొస్తూ 'ప్రదర్శన జంతువులు' జాబితా నుంచి ఎద్దులను తొలగిస్తున్నట్లు అందులో ప్రస్తావించారు.

ఈ కీలక మార్పుతో... జల్లికట్టు నిర్వహణపై సుప్రీంకోర్టు జారీ చేసిన నిషేధాజ్ఞల నుంచి బయటపడటానికి వీలు ఏర్పడింది. సుప్రీం ఇచ్చిన ఆదేశాలతో 2014 నుంచి జల్లికట్టుపై నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. తాజా ఆర్డినెన్స్‌తో మూడేళ్ల తర్వాత మళ్లీ అధికారికంగా జల్లికట్టు ప్రారంభమవుతోంది.

జల్లికట్టుకు-హోదాకు లింక్ పెట్టిన పవన్ కళ్యాణ్, ఏపీ నేతలపై అనుమానంజల్లికట్టుకు-హోదాకు లింక్ పెట్టిన పవన్ కళ్యాణ్, ఏపీ నేతలపై అనుమానం

అయినా ఆందోళనలు...

జల్లికట్టు నిర్వహణపై ఆర్డినెన్స్‌ వచ్చినా తమిళ యువత తమ ఉద్యమాన్ని ఆపలేదు. ఆర్డినెన్స్‌ స్థానంలో శాశ్వత చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మెరీనా బీచ్‌లోను ఆందోళనలు కొనసాగుతున్నాయి.

చెన్నై మెరీనాతీరంలో ఏకంగా 10 లక్షల మంది యువకులు ఉద్యమిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వేలూరులో వేలాది మంది ఆందోళనకారులు కళ్లకు నల్ల రిబ్బన్‌లు కట్టుకుని నిరసన కొనసాగిస్తున్నారు. జల్లికట్టు నిర్వహణకు సంబంధించి డీఎంకే కార్యకర్తలు చెన్నైలోని వళ్లువర్‌కోట్టం వద్ద ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ నేతృత్వంలో నిరాహారదీక్షలు చేశారు.

English summary
Unhappy with the secrecy around the ordinance, protesters want to know the contents of the ordinance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X