వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మానవత్వమే మన మతం: ఇది యంగ్ ఇండియా: ప్రపంచం మొత్తం భారత్ వైపే: మోడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లోనే అగ్రరాజ్యంగా ఎదగడానికి భారత్‌కు ఇదే సరైన సమయమని, దాన్ని అందిపుచ్చుకోవడానికి అన్ని చర్యలను తీసుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల చూపులు కూడా భారత్‌వైపే ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నో అవకాశాలకు భారత్ కేంద్ర బిందువుగా మారిందని, ల్యాండ్ ఆఫ్ అపార్చునిటీస్‌గా మారిందని ఆయన స్పష్టం చేశారు. ఇది యంగ్ ఇండియా అంటూ ఆయన అభివర్ణించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద ప్రవేశపెట్టిన ధర్మవాద తీర్మానంపై నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు.

Recommended Video

Rahul Gandhi Tweet Viral,నియంతల పేర్లన్నీ ‘ఎం'తోనే..!!

అమరావతిపై వైఎస్ జగన్ ఏం చెప్పబోతున్నారు?: హైకోర్టు అభిప్రాయం? సుదీర్ఘ విరామంఅమరావతిపై వైఎస్ జగన్ ఏం చెప్పబోతున్నారు?: హైకోర్టు అభిప్రాయం? సుదీర్ఘ విరామం

ఓ పౌరుడు తాను కన్న కలలను సాకారం చేసుకోవడానికి అసరమైన అన్ని రకాల అవకాశాలు దేశంలో ఉన్నాయని, వాటిని కల్పించడంలో తమ ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పారు. ఇలాంటి అవకాశాలను తాము జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. సంక్షోభం నుంచి అవకాశాలను వెదుక్కుంటున్నామని, వాటిని సాఫల్యం చేసుకుంటున్నామని అన్నారు. ఇటీవలి కాలంలో అనేకక సవాళ్లను భారత్ ఎదుర్కొందని మోడీ అన్నారు. పోలియో, స్మాల్ పాక్స్ వంటి ప్రమాదకర దశ నుంచి ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌ను సొంతంగా అభివృద్ధి చేసుకునే స్థాయిలో భారత్ ఎదిగిందని మోడీ చెప్పారు.

Our democracy is not a western institution. Its a human institution: PM Modi in Rajya Sabha

కరోనా వంటి వైరస్‌కు మనదేశం సొంతంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తుందని ఎవరూ అనుకుని ఉండకపోవచ్చని అన్నారు. అలాంటి దశ నుంచి ప్రపంచం మొత్తానికీ వ్యాక్సిన్‌ను అందజేసే స్థాయికి చేరుకుందని, ఫలితంగా ఇప్పుడందరి దృష్టీ ఇటు వైపే మళ్లిందని పునరుద్ఘాటించారు. సమీప భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలను సృష్టిస్తామని మోడీ స్పష్టంచేశారు. భారత ప్రజాస్వామ్యానికి మానవత్వమే పునాది అని మోడీ పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యానికి, విదేశీ విధానాలను అనేక సారూప్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

Our democracy is not a western institution. Its a human institution: PM Modi in Rajya Sabha

గత చరిత్ర మొత్తం ఘనమైన ప్రజాస్వామ్య విలువలు, నైతికతను ప్రపంచానికి బోధించిందని గుర్తు చేశారు. ప్రాచీన భారత్‌లో 81 ప్రజాస్వామ్యాలు విలసిల్లాయని చెప్పారు. అలాంటి భారత్‌లో ఇప్పుడు జాతీయవాదంపై దాడి చేసే ప్రయత్నం సాగుతోందని అన్నారు. దేశ చరిత్ర, ప్రజాస్వామ్య విలువల గురించి యువతకు ప్రత్యేకించి గుర్తు చేయాల్సిన పని లేదని, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతుందని అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ వాకౌట్ చేయడాన్ని నరేంద్ర మోడీ తప్పు పట్టారు.

English summary
Prime Minister Narendra Modi replies in Rajya Sabha to the Motion of Thanks on the President’s Address said that The eyes of the world are on India. There are expectations from India and there is confidence that India will contribute to the betterment of our planet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X