వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాహనాలు మురికిగా ఉన్నా ఫైన్ .... మన వాహన చట్టం చాలా నయం !! సెలవిచ్చిన మంత్రి గడ్కరీ

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కొత్త మోటార్ వెహికల్ యాక్ట్ పలు విమర్శలకు కారణమవుతుంది. కొత్త వాహన చట్టం అమలులోకి వచ్చిన తరువాత దేశంలో జరిమానాలు భారీగా విధిస్తున్నారు. కొత్త కొత్త నిబంధనలతో వాహన చోదకులకు చుక్కలు చూపిస్తున్నారు. దీంతో ప్రజలు భయపడి వాహనాలను నడపాలి అంటేనే భయపడుతున్నారు. కొత్త వాహన చట్టం తో ఫైన్ల వీరబాదుడుకు ప్రభుత్వం తెలపడంతో ఈ వాహనాలు మాకొద్దు బాబోయ్ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

కొత్త వాహన చట్టంపై వాహన చోదకుల విమర్శలు .. మన వాహన చట్టం ఎంత నయం అంటున్న గడ్కరీ

కొత్త వాహన చట్టంపై వాహన చోదకుల విమర్శలు .. మన వాహన చట్టం ఎంత నయం అంటున్న గడ్కరీ

రోడ్లు సరిగా లేవని, పార్కింగ్ జోన్లు అసలే లేవని కానీ ప్రభుత్వం నిబంధనల పేరుతో వాహనచోదకుల జేబులకు చిల్లులు పెడుతోందని ఆవేదన చెందుతున్నారు భారత్ లోని వాహన చోదకులు . దీనిపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరి స్పందిస్తూ బయట దేశంలోని వాహన చట్టాల కంటే, మన వాహన చట్టం ఎంతో నయం అని తేల్చి చెప్పారు. రోడ్డుపై యాక్సిడెంట్స్ అవుతుంటే.. ప్రభుత్వం ఏం చేస్తుందని, చట్టాలు సరిగ్గా లేవని, పోలీస్ వ్యవస్థ సరిగా లేదని ప్రజలే మండిపడుతున్నారని ఆయన అన్నారు .చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తే ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చేస్తే అమెరికాలో భారీగా ఫైన్లు

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన చేస్తే అమెరికాలో భారీగా ఫైన్లు

చట్టాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని.. ప్రజల సేఫ్టీ కోసమే వాహన చట్టం తీసుకొచ్చామని చెప్పారు నితిన్ గడ్కరీ.ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానాలు మన దేశంలోనే కాదు ప్రపంచంలోని అమెరికా, రష్యా, బ్రిటన్, దుబాయ్, సింగపూర్ వంటి దేశాల్లో భారీగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో సీటు బెల్ట్ పెట్టుకోకపోతే 25డాలర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే 1000డాలర్లు, హెల్మెట్ లేకుంటే 300 డాలర్లు చలానా విధిస్తారు.

రష్యా, సింగపూర్ లలో సైతం ట్రాఫిక్ రూల్స్ కఠినతరం

రష్యా, సింగపూర్ లలో సైతం ట్రాఫిక్ రూల్స్ కఠినతరం

అదే రష్యా విషయానికి వస్తే.. డ్రంక్ అండ్ డ్రైవ్ కు 50వేల రూబుల్స్ తో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. ఇక సింగపూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 5000 డాలర్లు ఫైన్ వేస్తారు.వాహనం నడుపుతూ ఫోన్ మాట్లాడితే 1000 డాలర్ల ఫైన్ పడుతుంది.దుబాయ్ లో ఫైన్ల విషయానికొస్తే అక్కడ ఫైన్ లు సైతం చాలా వింతగా ఉంటాయి. అక్కడ రూల్స్ కు అసలు ప్రజలు వాహనాలను నడపనే వద్దు. అంత కఠినంగా అక్కడ వాహన చట్టం వుంటుంది.

దుబాయ్ లో వాహనాలు మురికిగా ఉన్నా ఫైన్ లు .. మారకుంటే వాహనం డంపింగ్ యార్డ్ కు తరలింపు

దుబాయ్ లో వాహనాలు మురికిగా ఉన్నా ఫైన్ లు .. మారకుంటే వాహనం డంపింగ్ యార్డ్ కు తరలింపు

అక్కడి ప్రభుత్వం శుభ్రతకు కూడా ప్రాముఖ్యత నిస్తుంది. మురికిగా ఉన్న వాహనాలు కనిపిస్తే ఒకసారి మొదట హెచ్చరిస్తారు.దాంతో పాటు 500 దిర్హామ్ లు ఫైన్ వేస్తారు. ఇక అదే వాహనం15 రోజుల తరువాత అంతే మురికిగా కనిపిస్తే దాన్ని డంపింగ్ యార్డ్ కు పంపిస్తారు .వీటితో పోల్చుకుంటే మనదగ్గర ఉన్న చట్టాలు తక్కువే అని చెప్పాలి అన్నది మంత్రివర్యుల మాట. ఏది ఏమైనప్పటికీ బయట దేశాలతో పోల్చుకున్నప్పుడు అదే తరహాలో రోడ్లు, వాహన చోదకులకు ప్రభుత్వం అందించే వసతులు అందాలన్నది మన దేశంలోని వాహనచోదకుల ప్రధాన డిమాండ్.

English summary
Indians are angry about the new motor vehicle act that the roads are not good and that there are no parking zones. Union Minister Nitin Gadkari responded by stating that our vehicle law is much better than out-of-country vehicle laws.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X