వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి రోజు: 1.91 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్, ఏ రాష్ట్రంలో ఎన్ని టీకాలు వేశారంటే.?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశంలో శనివారం ప్రారంభమైన ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం తొలి రోజు విజయవంతంగా ముగిసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. తొలి రోజు 1,91,181 మంది టీకా తీసుకున్నారని వెల్లడించింది. అంతేగాక, శనివారం టీకా తీసుకున్నవారిలో ఎవరూ అనారోగ్యానికి గురికాలేదని స్పస్టం చేసింది.

23 రాష్ట్రాల్లో రెండు వ్యాక్సిన్లు..

23 రాష్ట్రాల్లో రెండు వ్యాక్సిన్లు..

దేశంలోని 3351 కేంద్రాల్లో జరిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో 16,755 మంది సిబ్బంది పాల్గొన్నారని తెలిపింది. కానీ, కోవిన్ యాప్‌లో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో కొన్ని చోట్ల వ్యాక్సినేషన్ కొంత ఆలస్యమైందని తెలిపింది. తొలి రోజు 12 రాష్ట్రాల్లోకోవాగ్జిన్, మరో 11 రాష్ట్రాల్లో కోవిషీల్డ్ టీకా వేసినట్లు తెలిపింది. కోవిడ్ టీకా డ్రైవ్ మొదటి రోజు విజయవంతంగా నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని మీడియా సమావేశంలో తెలిపారు. కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండింటినీ 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు.. అస్సాం (65 సెషన్లు), బీహార్ (301), ఢిల్లీ (81), హర్యానా (77), కర్ణాటక (242), మహారాష్ట్ర (285), ఒడిశా (161), రాజస్థాన్ (167) తమిళనాడు (160), తెలంగాణ (14), ఉత్తర ప్రదేశ్ (317) వ్యాక్సిన్ సెషన్స్ నిర్వహించారు.

దేశానికి సంజీవనిలా వ్యాక్సిన్లు

దేశానికి సంజీవనిలా వ్యాక్సిన్లు

కాగా, కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో సమీక్షించారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభంతో ఉపశమనం లభించిందని తెలిపారు. కరోనా వైరస్ పై పోరాటం చేసేందుకు ఈ టీకాలు సంజీవనిలా దేశం ముందు నిలిచాయన్నారు. కరోనా వ్యాక్సిన్ రూపొందించడంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు, టీకా పరిశ్రమలు, ట్రయల్స్‌లో పాల్గొన్నవారికి, సహకారం అందించిన ప్రతీఒక్కరికీ ఆయన అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ తొలి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేసి సురక్షితమైన వ్యాక్సిన్లను అభివృద్ధి చేశారని తెలిపారు. టీకా పంపిణీ కార్యక్రమంపై భారత సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. సైనిక ఆస్పత్రుల్లో పనిచేసే 3వేల మందికి పైగా వైద్య సిబ్బంది తొలి డోసు వేయించుకున్నట్లు వెల్లడించింది.

ఏ రాష్ట్రంలో ఎన్ని టీకాలు వేశారంటే..?

ఏ రాష్ట్రంలో ఎన్ని టీకాలు వేశారంటే..?

1,65,714 మంది లబ్ధిదారులలో అండమాన్, నికోబార్ దీవుల నుంచి 78, లడఖ్ నుంచి 76, డామన్, డయ్యూ నుంచి 43, దాద్రా, నగర్ హవేలీ నుంచి 64, లక్షద్వీప్ నుంచి 21, చండీగఢ్ నుంచి 195, గోవా నుంచి 373 మంది ఉన్నారు. అంతేకాకుండా 16,963 మందికి ఆంధ్రప్రదేశ్‌లో టీకాలు వేశారు. ,బీహార్‌లో 16,401, మహారాష్ట్రలో 15,727, ఛత్తీస్‌గఢ్‌లో 4,985, గుజరాత్‌లో 8,557, అరుణాచల్ ప్రదేశ్‌లో 743, అస్సాంలో 2,721, ఢిల్లీలో 3,403, హర్యానాలో 4,656, హిమాచల్ ప్రదేశ్‌లో 1,408, జమ్మూలో 1,954కి వ్యాక్సిన్ వేశారు.

మొదటి రోజు 3,096 మంది లబ్ధిదారులు జార్ఖండ్‌లో, కర్ణాటకలో 13,594, కేరళలో 8,062, మధ్యప్రదేశ్‌లో 9,219, మణిపూర్‌లో 585, మేఘాలయలో 509, మిజోరాంలో 314, నాగాలాండ్‌లో 561, ఒడిషాలో 13,746, ఒడిషాలో, 274 పంజాబ్, రాజస్థాన్‌లో 9,279, సిక్కింలో 120, తమిళనాడులో 2,945, తెలంగాణలో 3,653, త్రిపురలో 355, ఉత్తర ప్రదేశ్‌లో 21,291, ఉత్తరాఖండ్‌లో 2,276, పశ్చిమ బెంగాల్‌లో 9,730.

English summary
India began its nationwide vaccination drive against Covid-19 and as many as 1,91,181 people were vaccinated on Day 1, Union Health Ministry said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X