బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో 107 మంది విదేశీయులు అరెస్టు, డ్రగ్స్, గంజాయి విక్రయాలు, అక్రమంగా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో డ్రగ్స్ విక్రయిస్తూ అక్రమంగా నివాసం ఉంటున్న 107 మంది ఆఫ్రికా దేశీయులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి కోకైన్, ఎల్ ఎస్ డీ, గంజాయి స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఆఫ్రికా దేశాలకు చెందిన అనేక మంది బెంగళూరు చేరుకుని అక్రమంగా నివాసం ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. బెంగళూరు పోలీసులు ఆఫ్రికా దేశీయుల మీద నిఘా వేశారు. వారి కార్యక్రమాలపై ఆరా తీశారు.

Over 107 Africans arrested face deportation in Bengaluru city

సోమవారం ఉదయం 6 గంటల నుంచి బెంగళూరు నగరంలో పోలీసులు ఒక్క సారిగా సోదాలు ముమ్మరం చేశారు. వైట్ ఫీల్డ్ ఉప విభాగంలో 25 మంది, బెంగళూరు ఈశాన్య విభాగంలో 50 మంది, బెంగళూరు తూర్పు విభాగంలో 32 మందితో పాటు బెంగళూరులో మొత్తం 10 ప్రాంతాల్లో 107 మంది విదేశీయులను పోలీసులు అరెస్టు చేశారు.

ఆఫ్రికాకు చెందిన వారి నుంచి 60 గ్రాముల కోకైన్, 10 గ్రాముల ఎల్ఎస్ డీ, 650 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అరెస్టు అయిన వారిలో నైజీరియా, సుడాన్, రపాండా, ఉగాండా, ఫెనాతో పాటు ఆఫ్రికా దేశాల వారు ఉన్నారని, వీసా గడువు పూర్తి అయినా నియమాలు ఉల్లంఘించి ఇక్కడే మాకం వేసిన వారు ఉన్నారని, వీరు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
The Bengaluru city police picked up at least 200 African nationals residing in the city and later arrested 107 of them on multiple charges, including overstaying.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X