వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీచుల్లో రాకాసి జెల్లీఫిష్‌ల కలకలం: 150మందికి గాయాలు, హడలెత్తిపోతున్న జనం

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఒక్కసారి కుడితే జస్ట్ 20 గంటలపాటు నొప్పి ఉంటుందట!!!

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో రాకాసి బ్లూ బాటిల్ జెల్లీఫిష్‌లు కలకలం రేపుతున్నాయి. విషపూరిత 'బాటిల్‌ జెల్లీఫిష్‌లు' సంచరిస్తుండటంతో ముంబై బీచ్‌లో సంచరించేందుకు ప్రజలు వణికిపోతున్నారు. జూహూ బీచ్‌లో గత రెండు రోజుల్లో 150 మంది వీటి దాడుల్లో గాయపడినట్లు సమాచారం. బీచ్‌లో ఎక్కడ చూసినా అలర్ట్‌ బోర్డులు కనిపిస్తున్నాయి.

ప్రమాదకరమైనవి కావు..

ప్రమాదకరమైనవి కావు..

బ్లూ బాటిల్‌ జెల్లీఫిష్‌ విషపూరితమైనవి కావటంతో వాటికి రాకాసి జెల్లీఫిష్‌లుగా పేరుపడిపోయింది. అయితే అవి మరీ అంత ప్రమాదకరమైనవి కాదని అధికారులు చెబుతున్నారు.

ఈసారి భారీ సంఖ్యలో...

ఈసారి భారీ సంఖ్యలో...

‘ఈ విషయంలో అపోహలు వద్దు. వాటి విషంతో చేపలను మాత్రమే చంపుతాయి. మనుషులను కరిచినప్పుడు వాటి విషం వల్ల వచ్చిన ప్రమాదం ఏం లేదు. కాకపోతే విపరీతమైన నొప్పి కొద్ది గంటలపాటు ఉంటుంది. ప్రతీ ఏటా అవి బీచ్‌లో సంచరిస్తుంటాయి. ఈ దఫా భారీ సంఖ్యలో అవి వచ్చి చేరాయి. అయినప్పటికీ ఆ చుట్టుపక్కలకు వెళ్లకపోతే మంచిది' అని అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

చాలా మంది గాయపడ్డారు..

చాలా మంది గాయపడ్డారు..

‘బీచ్‌కి వస్తున్న ఎంతో మంది గాయపడ్డారు. విష ప్రభావం పని చేయకుండా వాళ్ల కాళ్లకు నిమ్మకాయ రాస్తున్నా. ప్రజలకు నేను సూచించేది ఒక్కటే. బీచ్‌కు రాకపోవటమే ఉత్తమం' అని అక్కడ ఓ షాపు నిర్వహించే వ్యక్తి తెలిపాడు.

ఈ చేపలు కరిస్తే తీవ్రమైన నొప్పి..

ఈ చేపలు కరిస్తే తీవ్రమైన నొప్పి..

ముంబైలోనిని బీచ్‌లలో సాధారణంగా వర్షాకాలం మధ్యలో ఇలాంటి జెల్లీఫిష్‌లు కనపడుతూ ఉంటాయి. అయితే ఈసారి ఎక్కువ మొత్తంలో వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ జెల్లీఫిష్‌ల కారణంగా దాదాపు 150 మంది గాయపడినట్లు తెలుస్తోంది.

ఈ బ్లూ బాటిల్‌ జెల్లీఫిష్‌లు కరవడం వల్ల మనుషుల ప్రాణాలకేమీ ప్రమాదం ఉండదు కానీ కొన్ని గంటల పాటు తీవ్రమైన నొప్పి, దురద ఉంటుంది.

English summary
Scores of blue bottle jellyfish also known as Portuguese man-of-war were spotted across the beaches of Mumbai, causing panic and fear among the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X