వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర ప్రభుత్వశాఖల్లో 4లక్షల ఉద్యోగాలు: తర్వలోనే భర్తీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. సీనియర్‌ ఉద్యోగులు పదవీ విరమణ చేయడం, కొందరు మధ్యలోనే ఉద్యోగాలను వదిలేయడంతో లక్షల సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఖాళీల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.

ప్రస్తుతం పలు ప్రభుత్వ శాఖల్లో 4లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

Over 4 lakh posts vacant in central government departments: Minister

'2016 మార్చి 1 నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ, మంత్రిత్వ శాఖల్లో 36,33,935 పోస్టులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటిల్లో 4,12,752 పోస్టులు ఖాళీగా ఉన్నాయి' అని జితేంద్రసింగ్‌ వెల్లడించారు.

త్వరలోనే వీటిని భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అంతేగాక.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలనే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్దకు రాలేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

English summary
Over four lakh posts are vacant in various central government departments, the Lok Sabha was informed Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X