వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: మరో డేరా బాబా, 40 మంది బాలికలకు విముక్తి,, లైంగిక దాడులు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డేరా బాబా లాంటి మరో బాబా ఘటన న్యూఢిల్లీలో వెలుగు చూసింది. ఆధ్యాత్మికత ముసుగులో దారుణాలకు పాల్పడుతున్న బాబా వీరేందర్‌దేవ్ దీక్షిత్ ఆశ్రమంపై దాడి చేసి 41 మంది అమ్మాయిలకు విముక్తి కల్పించారు.

Recommended Video

డేరాబాబా బెడ్ రూంలో నగ్నంగా తిరుగుతూ వీడియో తీయించిన హనీప్రీత్? | Oneindia Telugu

మహిళపై స్కూల్ మానేసిన టీనేజర్ల గ్యాంగ్‌రేప్మహిళపై స్కూల్ మానేసిన టీనేజర్ల గ్యాంగ్‌రేప్

హర్యానా రాష్ట్రంలో డేరా బాబా ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కల్గించింది. డేరాబాబా అరెస్ట్ సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అయితే నకీలీ భాబాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ధార్మిక సంఘాలు నకిలీ బాబాల పేర్లను కూడ ఆ సమయంలో వెల్లడించాయి.

'బోయ్‌ఫ్రెండ్‌తో అభ్యంతరకంగా చూశాను', ' నాపై అత్యాచారం చేశాడు''బోయ్‌ఫ్రెండ్‌తో అభ్యంతరకంగా చూశాను', ' నాపై అత్యాచారం చేశాడు'

అయితే అదే తరహ ఘటన ఒకటి ఢిల్లీలో చోటు చేసుకొంది. ఢిల్లీ ఆశ్రమంలో ఉన్న 41 మంది బాలికలకు గురువారం రాత్రి పోలీసులు విముక్తి కల్పించారు.అచ్చు డేరా బాబా తరహలోనే వ్యవహరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

టీచర్ గ్యాంగ్‌రేప్,హత్య: నలుగురు స్టూడెంట్స్‌కు జీవిత ఖైదుటీచర్ గ్యాంగ్‌రేప్,హత్య: నలుగురు స్టూడెంట్స్‌కు జీవిత ఖైదు

 మరో డేరా బాబా

మరో డేరా బాబా

ఢిల్లీలో మరో డేరా బాబా ఘటన వెలుగు చూసింది. బాబా వీరేందర్‌ దేవ్‌ దీక్షిత్‌ ఆశ్రమంలో పోలీసుల సహకారంతో మహిళా కమీషన్‌ సుమారు 41 మంది అమ్మాయిలకు విముక్తి కలిగించింది. బాలికలను గదుల్లో బంధించి శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

కోర్టు ఆదేశాల మేరకు

కోర్టు ఆదేశాల మేరకు

కోర్టు ఆదేశం మేరకు పోలీసులు సోదాలు నిర్వహించారు. అక్రమంగా బంధించిన అమ్మాయిలకు విముక్తి కలిపించారు. వీరేంద్రను తక్షణమే అరెస్ట్ చేయాలని డీసీడబ్ల్యూ చీఫ్‌ స్వాతి మలివాల్‌ డిమాండ్ చేస్తున్నారు. కొంతకాలంగా ఈ ఆశ్రమంపై ఆరోపణలు వస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు.

 మహిళా ఫిర్యాదుతో

మహిళా ఫిర్యాదుతో

ఈ ఆశ్రమంలో బాబాపై ఓ మహిళా ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాబాపై మహిళా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ విషయం వెలుగు చూసింది. ఈ ఆశ్రమంలో సుమారు వంద మంది మహిళలు జంతువుల మాదిరిగా హింసిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది.ఇదే విషయాన్ని న్యాయవాది నందితరావ్ కోర్టుకు వివరించింది.

 మహిళలపై లైంగిక దాడులు

మహిళలపై లైంగిక దాడులు

బయటి ప్రపంచానికి తాము సాధ్వీలుగా కనిపించినప్పటికీ.. లోపల మాత్రం తాము నరకం అనుభవించేవాళ్లమని.. విషయం బయటికి తెలిస్తే ప్రాణాలు తీసేస్తామని వీరేందర్‌ బెదిరించేవారని బాధితురాలు ఆరోపణలు గుప్పించారు. ఇప్పటిదాకా వేలాది మందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది. అయితే ఈ దారుణాలకు పాల్పడిన వీరేందర్ పరారీలో ఉన్నారు.

English summary
Over 40 girls were rescued by the Delhi Commission for Women along with the Child Welfare Committee and the Delhi Police from Rohini's Adhyatmik Vishwa Vidyalaya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X