వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ ఎమ్మెల్యేల్లో 61 శాతం మంది క్రిమినల్స్? 74 శాతం మంది కోటీశ్వరులు: ఏడీఆర్ రిపోర్టు

|
Google Oneindia TeluguNews

సామాన్యుడి కేంద్రంగా రాజకీయాలు నడుపుతామంటూ పార్టీకి కూడా ఆమ్ ఆద్మీ అని పేరుపెట్టుకున్నా... చీపురు గుర్తుపై గెలిచినవాళ్లలో ఎక్కువ మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల వ్యవస్థలో మార్పుల కోసం విశేషంగా కృషి చేస్తోన్న ''అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్)'' సంస్థ ఢిల్లీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల క్రిమినల్, ఫైనాన్షియల్, ఎడ్యుకేషనల్ బ్యాగ్రౌండ్ ను బుధవారం బయటపెట్టింది.

ఇదీ లెక్క..

ఇదీ లెక్క..

ఏడీఆర్ రిపోర్టు ప్రకారం ఢిల్లీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 70 మంది ఎమ్మెల్యేల్లో 61 శాతం మంది.. అంటే 43 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. 2015లో ఇది 34 శాతంగా ఉండేది. మహిళలపై అత్యాచారం, హత్య, దాడులు, అవనీతి కేసులున్న ఎమ్మెల్యేల సంఖ్య గతంతో పోల్చుకుంటే 2020లో రెట్టింపయింది.

పార్టీల వారీగా చూస్తే..

పార్టీల వారీగా చూస్తే..


ఏడీఆర్ రిపోర్టును పార్టీలవారీగా చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గెలిచిన 62 మంది ఎమ్మెల్యేల్లో 38 మందిపై.. అంటే 61 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయి. అందులో సీఎం కేజ్రీవాల్ పైనే అత్యధికంగా 13 కేసులుండటం గమనార్హం. ఇక బీజేపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురిపై.. అంటే 63 శాతం మంది క్రిమినల్ కేసుల్లో నిందితులు. ఒక బీజేపీ సభ్యుడితోపాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రాంనివాస్ గోయల్ క్రిమినల్ కేసుల్లో దోషులుగానూ నిరూపణఅయింది.

మినిమమ్ ఆస్తి రూ.6 కోట్లు

మినిమమ్ ఆస్తి రూ.6 కోట్లు


ఢిల్లీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 74 శాతం మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ రిపోర్టులో వెల్లడైంది. 2015లో డబ్బున్న ఎమ్మెల్యేలు 63 శాతం మంది ఉండగా, ఇప్పుడది పెరిగింది. కోటీశ్వరులైన ఎమ్మెల్యేల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవాళ్లు 73 శాతం మందికాగా, బీజేపీ ఎమ్మెల్యేల్లో 88 శాతం మంది ఉన్నారు. ఢిల్లీ ఎమ్మెల్యేల సరాసరి కనీస ఆస్తి రూ.6కోట్లుగా ఉన్నట్లు తెలిసింది. రూ.292 కోట్ల ఆస్తులతో అందరిలోకీ ముంద్కా ఎమ్మెల్యే ధరంపాల్ లక్రా కుబేరుడిగా నిలవగా, ఆర్కే పురం ఎమ్మెల్యే పరిమళ టోకాస్ కు 80 కోట్లు, పటేల్ నగర్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ 78 కోట్ల ఆస్తులున్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించారు.

ఇంకొన్ని కీలక పాయింట్లు..

ఇంకొన్ని కీలక పాయింట్లు..


కొత్తగా ఎన్నికైన 70 మంది ఎమ్మెల్యేల్లో 42 మంది మాత్రమే గ్రాడ్యుయేషన్, ఆ పైస్థాయి చదువులు పూర్తిచేనవాళ్లున్నారు. 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఎమ్మెల్యేలు 56 శాతం ఉన్నారు. ఈసారి అసెంబ్లీకి ఎనిమిది మంది మహిళలు ఎన్నికయ్యారు. 2015లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య ఆరుగా ఉండేది.

English summary
43 elected MLAs face criminal cases, of whom 37 have declared serious charges including those related to rape, attempt to murder and crime against women, as per a study by Association for Democratic Reforms (ADR)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X