వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకలి బాధలు.. ఇదీ సెక్స్ వర్కర్స్ ఆవేదన.. ఢిల్లీ నుంచి 3వేల మంది స్వస్థలాలకు..

|
Google Oneindia TeluguNews

కరోనా లాక్ డౌన్ కారణంగా పేద,దిగువ మధ్య తరగతి జీవుల బతుకులు చితికిపోయాయి. రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు ఉద్యోగ,ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయాయి. వలసొచ్చిన చోట బతుకుదెరువు కరువవడంతో తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. సెక్స్ వర్కర్స్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. లాక్ డౌన్ ఎఫెక్ట్‌తో పని లేకుండా పోవడంతో నగరాల్లో బతకలేక తిరిగి స్వగ్రామాలకు వెళ్లిపోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 60శాతం మంది సెక్స్ వర్కర్స్ ఇప్పటికే స్వస్థలాలకు వెళ్లిపోయారు.

స్వస్థలాలకు 3వేల మంది..

స్వస్థలాలకు 3వేల మంది..

'ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీలో 5వేల మంది రిజిస్టర్డ్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు. ఇందులో 60శాతం అంటే,3వేల మంది ఇప్పటికే స్వస్థలాలకు వెళ్లిపోయారు.' అని ఆల్ ఇండియా నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్(AINSW) అధ్యక్షుడు కుసుం వెల్లడించారు. తిండి,మందులు,కనీస అవసరాలకు కూడా డబ్బుల్లేని పరిస్థితులే వారి స్వస్థలాకు వెళ్లడానికి కారణమన్నారు.

బతకడం కోసం విధిలేని పరిస్థితుల్లో

బతకడం కోసం విధిలేని పరిస్థితుల్లో

26 ఏళ్ల రవళి(పేరు మార్చాం) అనే ఓ సెక్స్ వర్కర్ మాట్లాడుతూ.. '18 ఏళ్ల వయసులో నేను ఉత్తరప్రదేశ్‌లోని మా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. నిజానికి నేనో నటిని కావాలనుకున్నాను. కానీ బతకడం కోసం విధిలేని పరిస్థితుల్లో ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చింది. అప్పటినుంచి కనీసం తిండికి ఇబ్బందులు లేకుండా బతుకుతున్నాను. కానీ కరోనా లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపించింది. కస్టమర్స్ లేకుండా పోయారు. ఉన్న కాస్త డబ్బు కూడా అయిపోయింది' అని చెప్పుకొచ్చింది.

ఓ సెక్స్ వర్కర్ ఆవేదన..

ఓ సెక్స్ వర్కర్ ఆవేదన..

రజనీ(పేరు మార్చాం) అనే మరో సెక్స్ వర్కర్ మాట్లాడుతూ.. కాన్పూర్ వీధుల్లో తానో అనాథగా పెరిగానని,ఆ తర్వాత ఐదేళ్ల క్రితం ఢిల్లీలో వ్యభిచార వృత్తిలోకి దిగానని తెలిపింది. 'కానీ లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు పని లేకుండా పోయింది. తిండి లేదు,మందులకు కూడా డబ్బులు లేవు. నా దగ్గరున్న కాస్త డబ్బులతో ఢిల్లీలో బతకడం కష్టం. కాబట్టి ఇంకా ఇక్కడే ఉండటంలో అర్థం లేదు.' అని ఆవేదన వ్యక్తం చేసింది.

AINSW నిర్వాహకులు ఏమంటున్నారు..

AINSW నిర్వాహకులు ఏమంటున్నారు..

రవళి,రజనీ,కావ్య.. వీరంతా జీబీ రోడ్‌లో నివసిస్తున్నారు. ఇక్కడ కి.మీ పరిధిలో 100 వ్యభిచార గృహాలు ఉన్నాయి. దాదాపు 1500 మంది వరకు సెక్స్ వర్కర్స్ ఉన్నారు. ఇందులో చాలామంది రకరకాల వ్యాధులకు మెడికల్ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఇందులో హెచ్ఐవి/ఎయిడ్స్ పేషెంట్స్ కూడా ఉన్నారు. ఇన్నాళ్లు ఇక్కడి హెచ్ఐవి/ఎయిడ్స్ పేషెంట్స్ కోసం తాము పడ్డ శ్రమంతా వృథా అయిపోతోందని కుసుం తెలిపారు. వీరిలో చాలామంది గృహ హింసను తాళలేక ఇళ్ల నుంచి పారిపోయి వచ్చినవారేనని.. ఇప్పుడు వారంతా మళ్లీ బాధితులుగా మారిపోయే ప్రమాదం ఉందని అన్నారు. ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి తాము ఆందోళన చెందుతున్నామని చెప్పారు.

దేశమంతా ఇదే పరిస్థితి..

దేశమంతా ఇదే పరిస్థితి..

ఏఐఎన్ఎస్‌డబ్ల్యూ కోఆర్డినేటర్ అమిత్ కుమార్ మాట్లాడుతూ.. జీబీ రోడ్‌ ఇప్పుడు పూర్తిగా షట్ డౌన్ అయిందన్నారు. చాలామంది తమ స్వస్థలాలకు వెళ్లిపోయినట్టు చెప్పారు. తమకు సాధ్యమైనంత మేర డ్రై రేషన్,మందులు,మాస్కులు,శానిటైజర్స్ అందిస్తున్నామన్నారు. హెచ్ఐవి ట్రీట్‌మెంట్‌కు సంబంధించి వారికి కనీస అవగాహన కూడా కల్పించామని చెప్పారు. ఒక్క ఢిల్లీలోనే కాదు దేశంలోని పలు ప్రధాన నగరాల్లోని రెడ్ లైట్ ఏరియాల్లో సెక్స్ వర్కర్స్ పని లేక,తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలామంది తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.

English summary
Over 60 per cent of Delhi's sex workers have returned to their home states due to loss of means of livelihood amid the coronavirus-induced lockdown that pushed many of them to the brink of starvation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X