వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేరాలో ఘోరం.. ఆశ్రమంలో 600 ఆస్థిపంజరాలు, వెల్లడించిన గుర్మీత్ మద్దతుదారుడు!

డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

సిర్సా: డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ చేసిన ఘోరాలకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో దాదాపు 600 అస్థిపంజరాలు ఉన్న‌ట్లు గుర్మీత్‌ మద్దతుదారుడు ఒకరు తెలిపారు.

గుర్మీత్‌ కేసు విచారిస్తున్న సిట్‌ బృందం విచారణకు హాజరైన గుర్మీత్‌ మద్దతుదారుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఎంతో మందిని చంపేసి ప్రధాన కార్యాలయంలోనే పాతిపెట్టినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డేరా మాజీ సభ్యుడు డా. పి.ఆర్‌. నైన్‌, డేరా ఛైర్‌పర్సన్‌ విపాసనను సిట్‌ బృందం విచారించింది.

Over 600 skeletons buried inside Dera headquarters.. says Gurmeet Fallower to SIT Officials

జర్మనీకి చెందిన ఓ శాస్త్రవేత్త సలహా మేరకు అస్థిపంజరాలను పాతి పెట్టి ఆ స్థలంలో మొక్కలు నాటారని డాక్టర్‌ నైన్‌ సిట్‌ బృందానికి తెలియజేశారు. గతంలో కూడా డేరా ఆశ్రమంలో వందల సంఖ్యలో అస్థిపంజరాలు ఉన్నాయని ఓ స్థానిక పాత్రికేయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన కేసులో ప్రస్తుతం గుర్మీత్‌ 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. డేరా బాబా జైలుకు వెళ్లిన అనంతరం అతడు సాగించిన అకృత్యలు ఒక్కొక్కటే బయటికివస్తున్న సంగతి తెలిసిందే.

English summary
More than 600 skeletons are believed to be buried inside the Dera Saccha Sauda headquarters in Sirsa. Sources in the special investigation team (SIT) told Zee News that several skeletons are buried across the massive Dera campus, with saplings planted over them. Some of these saplings are now large trees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X