వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లోనే పాములను దాచాడు, విషంతో అతను ఏం చేస్తున్నాడంటే

పాముల నుండి విషాన్ని సేకరించేందుకుగాను అక్రమంగా భయంకరమైన విషసర్పాలను ఇంట్లోనే బంధించిన ఇద్దరిని పూణెలో పోలీసులు అరెస్టుచేశారు. నిందితుల నుండి సుమారు 70 పాములను స్వాధీనం చేసుకొన్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పూణె :పాముల నుండి విషాన్ని సేకరించి విక్రయించే ముఠాను పుణెలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా నుండి సుమారు 70 విష సర్పాలను స్వాధీనం చేసుకొన్నారు.ముఠా సభ్యులను పోలీసులు అరెస్టుచేశారు. తాను నివాసం ఉండే అపార్ట్ మెంట్ లోనే చెక్క పెట్టెల్లో, గోనెసంచుల్లో ఈ పాములను దాచిపెట్టాడు.

మహరాష్ట్రలోని పుణెలోని రంజిత్ ఖర్గరే , ధనుంజయ్ బెల్కుటే లు పాముల నుండి విషాన్ని సేకరించి విక్రయిస్తున్నారు. అయితే విషాన్ని సేకరించేందుకు గాను వీరిద్దరూ అక్రమంగా పాములను తమ వద్ద నిల్వ ఉంచుతున్నారని పోలీసులు చెప్పారు.

over 70 snakes seized from Pune flat, two arrested

ఖర్గరే నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ నుండి పోలీసులు నిల్వ ఉంచిన 70 పాములను స్వాథీనం చేసుకొన్నారు. అదే ఇంట్లో చిన్నపిల్లలు, భార్యతో కలిసి ఖర్గరే నివాసం ఉంటున్నాడు.

పోలీసులు స్వాధీనం చేసుకొన్న వాటిలో 41 భయంకరమైన విషసర్పాలున్నాయి.మరో 31 కోబ్రాలు ఉన్నాయని పోలీసులు చెప్పారు.ఈ పాములను సేకరించి వాటి నుండి విషాన్ని సేకరించి విక్రయిస్తున్నారని పోలీసులు చెప్పారు.దీనికి తోడు వీటిని స్మగ్లింగ్ చేసేందుకు ఉపయోగించేవారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

వైల్డ్ లైఫ్ చట్టం కింద నిందితులపై కేసు నమోదుచేసినట్టు పోలీసులు చెప్పారు. ఈ ఇంటిపై పోలీసులు దాడి చేసిన సమయంలో ఖర్గరే ఇంట్లో లేడు.అయితే ఇంట్లో పిల్లలు అతని భార్య మాత్రమే ఉన్నారు. ఇంట్లోనే పాములను దాచిపెడతారనే విషయం ఖర్గరే పిల్లలకు కూడ తెలుసని పోలీసులు చెప్పారు.

English summary
over 70 snakes mostly deadly Russell's vipers and cobras illegally kept for extracting venom have been seized from a residential apartment where a man was living with his wife and children.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X