• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యెల్లో శారీ ఆంటీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.. మొన్న పోలింగ్ ఆఫీసర్.. నిన్న ఓటర్

|

లక్నో : కామన్ పీపుల్ ఓవర్ నైట్ స్టార్ కావడం అంతా ఆషామాషీ వ్యవహారం కాదు. అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆ క్రెడిట్ దక్కుతుంది. కానీ ఓ సాధారణ పోలింగ్ అధికారిణి రాత్రికి రాత్రి సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. యెల్లో కలర్ శారీలో ఈవీఎంలు చేతపట్టి దిగిన ఫోటోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఆమె ఫోటోలను చూడనివారు లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అంతలా ఫేమస్ అయిపోయారు.

ఇలాంటి అందమైన పోలింగ్ ఆఫీసర్లు విధి నిర్వహణలో ఉంటే.. ఆ పోలింగ్ బూత్‌లో వంద శాతం ఓటింగ్ జరుగుతుందనే కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ ఫోటోలైతే సోషల్ మీడియాలో ఫుల్లుగా సర్క్యులేట్ అయ్యాయి. మొత్తానికి వెతికి వెతికి ఆమె ఎవరనే విషయం బయటపెట్టింది మీడియా. అయితే తాజాగా ఆదివారం నాడు జరిగిన తుది దశ పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత దిగిన ఫోటోలు మళ్లీ వైరల్‌గా మారాయి.

ఓవర్ నైట్ స్టార్

ఓవర్ నైట్ స్టార్

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన పోలింగ్ ఆఫీసర్ రీనా ద్వివేది ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. సోషల్ మీడియా పుణ్యమా అని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. యెల్లో శారీ, కళ్లకు అద్దాలు, చేతిలో ఈవీఎం.. అలా చూడగానే ఆకట్టుకునేలా ఫోటోలకు ఫోజిచ్చిన సదరు అధికారిణి రాత్రికి రాత్రి ఫేమ్ అయ్యారు. పసుపుపచ్చ చీరలో ఆమె అందం మరింత ఇనుమడించడంతో ఆ ఫోటోలు బాగా వైరలయ్యాయి.

లేటెస్ట్ ఫోటోలు మళ్లీ వైరల్

లేటెస్ట్ ఫోటోలు మళ్లీ వైరల్

యెల్లో కలర్ శారీలో మెరిసిపోయిన రీనా ద్వివేది.. సినీ యాక్టర్లను మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. ఆమె ఫోటోల కోసం గూగుల్‌లో తెగ వెతుకుతున్నారట. అంతేకాదు ఆమె కనబడ్డ చోటల్లా సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతున్నారట. అయితే ఆదివారం నాడు జరిగిన చివరి దశ పోలింగ్‌లో భాగంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ఆఫీసర్‌గా పసుపుపచ్చ చీరలో తళుక్కుమన్న రీనా.. ఓటు వేశాక పింక్ అండ్ గ్రీన్ కలర్ శారీలో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలు కూడా మళ్లీ వైరల్ అవుతున్నాయి.

------------------------

ఎగ్జిట్ పోల్స్‌తో బీజేపీ గోల్‌మాల్.. ఈవీఎంలను మార్చే కుట్ర.. నేతల హాట్ కామెంట్స్

 దేశవ్యాప్తంగా పాపులర్

దేశవ్యాప్తంగా పాపులర్

ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో పీడబ్ల్యూడీ విభాగంలో పనిచేస్తున్న రీనా.. దేవరియాలోని తన స్వగ్రామమైన పన్సర్షిలో ఓటు వేశారు. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా ఆమె నగరామ్ పోలింగ్ బూత్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో యెల్లో కలర్ శారీలో ఈవీఎంలను తీసుకెళ్తున్న ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.

ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ కావడంతో నెటిజన్లు భిన్నరకాలుగా కామెంట్ చేశారు. ఆ ఆఫీసర్ ఉన్నచోట 100 శాతం పోలింగ్ అవుతుందని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే తాను డ్యూటీ చేసిన పోలింగ్ బూత్‌లో 70 శాతం ఓటింగ్ నమోదైందని ఆమె చెప్పుకొచ్చారు. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం మెరుగైందని తెలిపారు. అయితే అది తన వల్ల కాదని.. ప్రజల్లో అవగాహన పెరిగిందని చెప్పారు. ఏదిఏమైనా రీనా ద్వివేది ఓవర్ నైట్ స్టార్‌గా గుర్తింపు పొందడం మాత్రం నిజంగా లక్కీయే.

English summary
PWD official Reena Dwivedi who came into lime light as over night star cast her vote in her native village Pansari in Deoria. She first rose to fame after a photograph of her wearing a yellow saree went viral during a poll duty in nagaaram Lucknow. Now once again viral her photos wearing a pink and green saree.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more