వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ.. మంత్రి చెప్పిన లెక్కలు.. భర్తీ ఎప్పుడంటే..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు || Central Governments Said Over 6.84 lakh Posts Were Vacant

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టులు ఎన్ని ఉన్నాయో తెలిస్తే షాక్‌కు గురవాల్సిందే. లోక్‌సభలో సంబంధిత మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఉద్యోగాల కల్పనలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతోందంటూ విపక్షాలు గొంతెత్తున్న తరుణంలో సాక్షాత్తు మంత్రి చెప్పిన లెక్కలు విస్మయం కలిగిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 6 లక్షల 84 వేల ఖాళీ పోస్టులు ఉన్నాయంటూ.. లోక్‌సభలో రాతపూర్వక సమాధానం ఇచ్చారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. మొత్తం విభాగాల్లో 38 లక్షల 2 వేల ఉద్యోగాలుండగా.. 2018, మార్చి నాటికి 31 లక్షల 18 లక్షల పోస్టుల్లో నియామకాలు జరిగినట్లు తెలిపారు. ఇక దాదాపు 6 లక్షల 84 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ వివరణ ఇచ్చారు.

పోలీస్ శాఖలో కొత్త కొలువులు.. 15 వేల నియామకాల భర్తీకి కసరత్తుపోలీస్ శాఖలో కొత్త కొలువులు.. 15 వేల నియామకాల భర్తీకి కసరత్తు

Over six lakh above vacant posts in central government departments

అయితే ఆ పోస్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ, ప్రమోషన్లు, మరణాలు తదితర కారణాలతో ఖాళీ అయిన పోస్టులంటూ మంత్రి పేర్కొన్నారు. అదలావుంటే సంబంధిత విభాగాలు, ఆయా శాఖలకు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా త్వరలోనే నియామక ప్రక్రియ చేపడతామని వివరించారు.

2019-21 లక్ష్యంగా లక్షా 03 వేల 266 పోస్టులను భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిటీ ద్వారా పరీక్షలు నిర్వహించేలా కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే క్రమంలో అటు రైల్వే శాఖ కూడా పలు నోటిఫికేషన్లు రిలీజ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. వీటికి తోడు రానున్న రెండు సంవత్సరాల కాలంలో మరిన్ని నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. త్వరలోనే భర్తీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలిపారు.

English summary
Amid chorus over lack of jobs, the government Wednesday said over 6.84 lakh posts were vacant in different departments under it. Of the total sanctioned strength of 38.02 lakh, 31.18 lakh were filled as on March 1, 2018, leaving 6.84 lakh posts vacant, according to a written reply by Minister of State for Personnel Jitendra Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X