చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెరీనాబీచ్ లో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని విధ్యార్థుల ఆందోళన

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని మెరీనాబీచ్ లో వందలాది మంది విధ్యార్థులు ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి నుండి ఈ ఆందోళన సాగుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై : జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చెన్నైలోని మెరీనాబీచ్ లో విధ్యార్థులు,యువకులు , ఐటి ఫ్రో ఫెషనల్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మంగళవారం రాత్రి నుండి ఈ ఆందోళన సాగుతోంది. ఈ ఆందోళనలో సుమారు మూడువేల మందికి పైగా పాల్గొన్నారు.

జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ మెరీనా బీచ్ కేంద్రంగా ఈ ఆందోళన సాగుతోంది. ఈ ఆందోళనలో ప్రధానంగా విధ్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుండి మెరీనాబీచ్ కేంద్రంగా ఈ ఆందోళన సాగుతోంది.

over three thousand protest at chennai's marina beach supporting jallikattu

పోలీసులు ఆందోళన కారులతో చర్చించినా ప్రయోజనం లేకుండా పోయింది. మెరీనాబీచ్ లో ఆందోళన చేస్తున్నవారికి మద్దతుగా పలు కశాళాలల నుండి విధ్యార్థులు వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు.

విధ్యార్థులతోపాటు ఐటి ఫ్రోఫెషనల్స్ కూడ ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకులు కూడ ఈ ఆందోళనలో పాల్గొని మద్దతు ప్రకటించారు.జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ డిఎంకె ఇటీవలనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.

English summary
hundreds of students and techies are protesting at chennai's marina beach since last night demanding permission to host the banned bull taming festival jallikattu in tamilnadu and ban on animal rights organisation people for ethical treatment of animals or peta
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X