పుట్టినరోజుల పేరిట రెచ్చిపోతే అంతే సంగతి.. ఇక జైలుపాలే..!
అహ్మదాబాద్ : పుట్టినరోజు వేడుకల పేరిట రచ్చ రచ్చ చేస్తే ఇక జైలుశిక్ష తప్పదంటున్నారు పోలీసులు. బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ రోడ్లపై రెచ్చిపోయే ఆకతాయిలకు ఇక చెక్ పెడతామంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో కేకు కోయడం, ఒకరికొకరు పూసుకుంటూ రోడ్లపై పరుగెత్తడం, ఫోమ్ స్ప్రే తో చెలగాటమాడటం లాంటివి కుదరవని హెచ్చరిస్తున్నారు.
చెడు వ్యసనాలకు బలి.. దొంగల్లా మారిన టెన్నిస్ కోచ్, క్రికెటర్
పుట్టినరోజు సెలబ్రేషన్స్ రోడ్లెక్కితే కఠిన చర్యలు తప్పవంటున్నారు గుజరాత్ పోలీసులు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో బర్త్డే సెల్రబేషన్స్ పేరిట పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అరెస్టులు తప్పవంటూ సూరత్ పోలీసులు ఆదేశాలు జారీ చేయడం చర్చానీయాంశమైంది. పుట్టినరోజు వేడుకల్లో వ్యక్తులను గాయపరచడం, అర్ధరాత్రి పూట రోడ్లపై పరుగెత్తడం చేస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. కొందరు యువకులు బర్త్డే ల పేరిట పార్టీలు చేసుకుంటూ న్యూసెన్స్ సృష్టిస్తున్నారని ఫిర్యాదులు అందడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామనేది ఉన్నతాధికారుల మాట.
To summarize, it's an order against public nuisance which can harm those involved. Detailed summary in pic.
— Harshal Modi (@grondmaster) May 15, 2019
Cake smearing is a tiny part. Bulk is against public celebration and usage of chemicals, tape & foam directly applied to the face. pic.twitter.com/sKOe1C38Nu
పుట్టినరోజు వేడుకలంటూ రోడ్డెక్కుతున్న కొందరు యువకులు.. దారిలో వెళ్లేవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాగే ఆకతాయిలు రెచ్చిపోతూ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇలాంటివి నివారించడానికే తాము కఠిన చర్యలు తీసుకోక తప్పడం లేదంటున్నారు పోలీసాధికారులు. ఒకవేళ తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే సీఆర్పీసీ 144 సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయడానికి అవకాశముందన్నారు.
ఇటీవల బర్త్డే బంప్స్ పేరిట కొందరు యువకులు పుట్టినరోజు జరుపుకునే స్నేహితులను ఇష్టమొచ్చినట్లుగా కొడుతున్నారు. అదెక్కడి కల్చరో తెలియదు గానీ.. ఇటీవల ఓ యువకుడు బలయ్యాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకే సూరత్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.