వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ భారత దేశానికి పోలీస్ కానిస్టేబులా లేక చౌదరీనా...! అసదుద్దిన్ ఓవైసీ

|
Google Oneindia TeluguNews

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమేరికా అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడడంపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దిన్ ఓవైసి తప్పుబట్టారు. కశ్మీర్ అంశం ఇరు దేశాల సమస్యగా భావిస్తున్న భారత్ ట్రంప్‌తో చర్చించాల్సిన అవసరం ఏమిటిని ఆయన ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే పంచాయితీలు పరిష్కరించాడానికి పోలీస్ లేక సమాజంలో సమస్యలు పరిష్కరించే చౌదరీనా అని ఎద్దేవా చేశారు.

కశ్మీర్ వివాదం ఇండియా, పాకిస్థన్‌కు చెందిన ద్వైపాక్షిక అంశమని, ఇందులో ఇతర దేశాల జోక్యాన్ని అంగీకరించమని స్పష్టం చేసిన భారత దేశం, ఇప్పుడు ట్రంప్‌తో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాల్సిన అవసరమేటని ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే కశ్మీర్ వివాదం పై ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించమని ఖరాఖండిగా చెప్పిన ప్రధాని ఎందుకు అమేరికాతో చర్చించడాని దుయ్యబట్టారు. ఈనేపథ్యంలోనే కశ్మీర్ వివాదంపై నెలకొన్న పరిస్థితులను వివరించాడానికి, ట్రంప్ ఎమైనా పోలీసా లేక పంచాయితీ పరిష్కరించే చౌదరీనా అంటూ ఎద్దెవా చేశారు. ఈ నేపథ్యంలోనే తాను ఫోన్ సంభాషణపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు,

Owaisi disappointment over Modi and Trump’s 30-minute long telephonic conversation

కాగా సోమవారం సాయంత్రం అమేరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడాడరు. ఈనేపథ్యంలోనే పాకిస్థాన్, ఇండియాల మధ్య నెలకొన్న టెన్షన్ వాతవరణాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని ట్రంప్ సూచించాడు. ఈనేపథ్యంలోనే దక్షిణాసియా దేశాల్లో నెలకొల్పాల్సిన శాంతి చర్యలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. దీంతోపాటు ముప్పైనిమిషాల పాటు ఇరు దేశాల అధినేతల మధ్య ఫోన్ సంభాషణలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన పలు అంశాలు చర్చకు రావడంతోపాటు, అంతర్జాతీయ ఉగ్రవాదంతో పాటు, ఉగ్రవాద నిర్మూలన, ప్రాంతీయంగా ఉన్న పేదరికం నిరక్షరాస్యత అంశాలపై చర్చించారు. మరోవైపు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలతో పాటు ఇటివల ఒసాకాలో జరిగిన జీ20 దేశాల సదస్సులో చర్చకు వచ్చిన అంశాల పురోగతిపై మాట్లాడినట్టు ప్రధాని కార్యాలయ వర్గాలు పేర్కోన్నాయి..

English summary
AIMIM chief Asaduddin Owaisi on Tuesday raised a question over the need to engage with US President Donald Trump on Kashmir
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X