వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా దురాక్రమణకు బాధ్యులెవరు... ఆ నిజాలు ఎందుకు చెప్పట్లేదు... డైలీ బ్రీఫింగ్స్ ఏవి...

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ప్రకటనపై ఎంఐఎం అధ్యక్షుడు,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఇంత బలహీనమైన,అసమర్థమైన ప్రకటనను తానెప్పుడూ చూడలేదన్నారు. జాతీయ భద్రత పేరుతో ఇదో అసహ్యకరమైన జోక్‌లా ఉందన్నారు. దీనిపై సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వలేదని,ఇచ్చి ఉంటే ప్రభుత్వాన్ని నిలదీసి ఉండేవాడినని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఆక్రమణకు బాధ్యులెవరు...

లదాఖ్‌లో దాదాపు 38వేల చదరపు కి.మీ భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న రాజ్‌నాథ్ ప్రకటన నేపథ్యంలో... దానికి బాధ్యులు ఎవరని అసదుద్దీన్ ప్రశ్నించారు. అదే సమయంలో, చైనా భారత భూభాగాన్ని ఆక్రమించలేదని... ఎలాంటి చొరబాట్లు జరగలేదని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. గత ఏడాది డిసెంబర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కూడా అసదుద్దీన్ ప్రస్తావించారు. 'అక్సాయ్ చిన్ భారత భూభాగంలో అంతర్భాగం,దానికోసం ప్రాణ త్యాగానికైనా సిద్దం' అని ప్రకటించిన అమిత్ షా... ఇప్పుడు దాని నుంచి వెనక్కి తగ్గి లదాఖ్‌ భూభాగాన్ని చైనాకు అప్పగించాలని నిర్ణయించారా...? అని ప్రశ్నించారు. అసలు ఆరోజు గాల్వన్ లోయలో ఏం జరిగింది... 20 మంది సైనికులను మనం ఎలా కోల్పోయాం..? అని నిలదీశారు.

ఆ నిజాలు ఎందుకు చెప్పట్లేదు...

బంధీలుగా ఉన్న మన సైనికుల గురించి ప్రభుత్వం ఎందుకు నిజాలు చెప్పట్లేదని అసద్ ప్రశ్నించారు. ఏప్రిల్,2020కి ముందు ఉన్న స్టేటస్ కోనే కొనసాగించాలని చైనాను డిమాండ్ చేశామని పార్లమెంటులో ఎందుకు చెప్పలేదు..? ప్రస్తుత పరిస్థితినే స్టేటస్ కోగా పరిగణించాలని మీరు అప్పటి నుండి డిమాండ్ చేశారా? అని నిలదీశారు. అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని సాయుధ బలగాలపై ఎందుకు రుద్దుతున్నారని... దౌత్య చర్చలు సాగించాల్సిన బాధ్యత మీదేనని,వాళ్లది కాదని ప్రభుత్వాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు.భారత్-చైనా వివాదంలో రష్యా మధ్యవర్తిత్వాన్ని ప్రభుత్వం ఎందుకు అంగీకరించిందన్నారు. మిగతా పొరుగు దేశాల వివాదాలకు కూడా ఇలాగే మధ్యవర్తిత్వాన్ని కోరుతారా అని ప్రశ్నించారు.

డైలీ బ్రీఫింగ్స్ ఏవి...

సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి మీడియా కేవలం లీకులపై మాత్రమే ఎందుకు ఆధారపడుతోందని ప్రశ్నించిన అసద్... అధికారిక ప్రతినిధులతో ప్రభుత్వం డైలీ బ్రీఫింగ్స్ ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.భారత ప్రభుత్వం ఒకరకంగా ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కి దిగుతోందని అసద్ విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనమంతా భారత సాయుధ బలగాలకు అండగా నిలవాలని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ చెబుతున్నారని... అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని అన్నారు. అయితే సమస్య పరిష్కారం విషయంలో అసలు మీ పాత్ర ఏదని ప్రశ్నించారు. సమస్య పరిష్కారాన్ని సైనికులపై ఎందుకు రుద్దుతున్నారని... అది బాధ్యత అని గుర్తుచేశారు.

రాజ్‌నాథ్ ప్రకటన...

రాజ్‌నాథ్ ప్రకటన...


భారత్-చైనా సరిహద్దు సమస్య పరిష్కారం విషయంలో ఇరు దేశాల మధ్య ఇప్పటివరకూ ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు,లదాఖ్‌లో చైనా 38వేల చదరపు కి.మీ భూభాగాన్ని ఆక్రమించిందని పేర్కొన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి భారీ ఎత్తున బలగాలను మోహరిస్తూనే ఉందని... ఇటు భారత బలగాలు కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించారని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్దంగా ఉందని... అయితే శాంతియుత పరిష్కారానికే తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.

English summary
On Tuesday, AIMIM chief termed Defence Minister Rajnath Singh's statement on the LAC situation as an "abominable joke" in the "name of national security". He questioned Prime Minister Narendra Modi's stance that the Chinese Army had not intruded into India. Weighing in on Singh's observation that China is in illegal possession of Indian land for many decades, Owaisi alleged that the Centre had probably decided to cede this territory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X