వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'మిడిల్ క్లాస్'కు ఊహించని దెబ్బ: ఆ ప్రతిపాదనలు అమలైతే సంక్షేమం కట్?

ద్విచక్ర వాహనం, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, నాలుగు గదుల ఇల్లు ఉన్నవారికి ఇకనుంచి సంక్షేమ పథకాలను వర్తింపజేయవద్దని సూచించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే మధ్య తరగతి జీవుల సంక్షేమం నుంచి పక్కకు తప్పుకోవాలనే యోచనలో ఉన్నట్లే కనిపిస్తోంది. సంక్షేమ పథకాల విషయంలో కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకుబోతుండటమే ఇందుకు కారణం.

పట్టణాలు, నగరాల్లో నివాసముండే కుటుంబాలకు సంక్షేమ పథకాలను వర్తింపజేసే విషయంలో కొత్త నిబంధనలను త్వరలోనే తీసుకురాబోతోంది. ఈ మేరకు బిబేక్ దెబ్రాయ్ కమిటీ ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఇందులో భాగంగా.. ద్విచక్ర వాహనం, వాషింగ్ మెషీన్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్, నాలుగు గదుల ఇల్లు ఉన్నవారికి ఇకనుంచి సంక్షేమ పథకాలను వర్తింపజేయవద్దని సూచించింది.

 Own fridge, AC or car? No welfare schemes for you

అయితే ఈ ప్రతిపాదనలపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఈరోజుల్లో చాలావరకు మధ్య తరగతి కుటుంబాల్లో ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ద్విచక్ర వాహనం అనేవి కామన్ అయిపోయాయి. వీటిని సాకుగా చూపి సంక్షేమం నుంచి తప్పించుకోవాలని చూస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ నిర్ణయంతో పట్టణ ప్రాంతాల్లోని 59శాతం మందికి సంక్షేమ పథకాలు దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

దెబ్రాయ్ నివేదిక ప్రకారం..పాలిథీన్ కవర్ల గుడిసెల్లో నివాసముండేవారు, ఎలాంటి ఆదాయం లేని, మగవారు లేని ఇళ్ల వారికి, పిల్లలు సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులుగా తేల్చారు.

English summary
About six in every 10 households in urban areas will be eligible for assessment for identifying whether they are entitled for government's social welfare schemes, according to the recommendation of a government panel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X