వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో ట్విస్ట్ .. స్కార్పియో యజమాని అనుమానాస్పద మృతి

|
Google Oneindia TeluguNews

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ ఇంటి దగ్గరలో పేలుడు పదార్థాల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే . స్కార్పియో వాహనంలో జిలెటిన్ స్టిక్స్ పెట్టి ముఖేష్ అంబానీ కి హెచ్చరిక లేఖ రాసిన ఈ వ్యవహారంలో ఊహించని విధంగా స్కార్పియో వాహనం యజమాని మన్సుఖ్ హిరెన్ మృతి చెందారు. కారు యజమాని మృతితో పోలీసులు ఈ కేసులో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .

 ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపుకు వాడిన స్కార్పియో వాహనం మన్సుఖ్ హిరెన్ ది గా గుర్తింపు

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపుకు వాడిన స్కార్పియో వాహనం మన్సుఖ్ హిరెన్ ది గా గుర్తింపు


ఇటీవల ఆంటిలియా సమీపంలో జెలిటిన్ స్టిక్స్ ఉన్న స్కార్పియో ను గుర్తించిన ముంబై పోలీసులు ఆ కారులో ఓ లేఖను కూడా గుర్తించారు. అందులో ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ లను ఉద్దేశించి ఇది ట్రైలర్ మాత్రమే, మరోసారి బాంబులు మీ వద్దకే వస్తాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ముఖేష్ అంబానీ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు, స్కార్పియో వాహనం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు చేశారు. స్కార్పియో వాహనం రిజిస్టర్డ్ యజమాని మన్సుఖ్ హిరెన్ ను గుర్తించిన పోలీసులు అతనిని విచారించారు.

 పోలీసుల విచారణలో తన వాహనం దొంగతనానికి గురైందన్న మన్సుఖ్ హిరెన్ ..

పోలీసుల విచారణలో తన వాహనం దొంగతనానికి గురైందన్న మన్సుఖ్ హిరెన్ ..


ముంబై పోలీసులకు మన్సుఖ్ హిరెన్ తన వాంగ్మూలంలో, తన కారు ఒక సంవత్సరానికి పైగా ఉపయోగంలో లేదని మరియు అతను ఇటీవల వాహనాన్ని విక్రయించాలనుకుంటున్నందున దానిని డ్రైవ్ చేస్తున్నానని, అయితే ఫిబ్రవరి 16వ తేదీన ములుంద్-ఐరోలి లింక్ రోడ్‌లో తన కారు రిపేర్ అయిన కారణంగా పార్క్ చేశానని మన్సుఖ్ హిరెన్ పోలీసు అధికారులతో చెప్పాడు. మరుసటి రోజు తాను అక్కడికి తిరిగి వెళ్ళి చూసే సరికి వాహనం దొంగిలించబడింది అని ఆయన పోలీసులకు చెప్పారు.

స్కార్పియో వాహన యజమాని మన్సుఖ్ హిరెన్ మృతి .. ఆత్మహత్యగా అనుమానం

స్కార్పియో వాహన యజమాని మన్సుఖ్ హిరెన్ మృతి .. ఆత్మహత్యగా అనుమానం

అంతేకాదు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మన్సుఖ్ హిరెన్ కు చెందిన దొంగిలించిన స్కార్పియో గురించి విఖ్రోలి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.
అయితే ఆ స్కార్పియో యజమాని మన్సుఖ్ హిరెన్ తాజాగా మృతి చెందడం ఈ కేసులో మరింత అనుమానాలకు కారణంగా ఉంది . నౌపాడా పోలీసులు శుక్రవారం హిరెన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మన్సుఖ్ హిరెన్ ఆత్మహత్య చేసుకుని మరణించాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు .

Recommended Video

Sebi Fines Mukesh Ambani ,Reliance Industries,Two Other Entities || Oneindia Telugu
థానేలోని రెతి బందర్ ప్రాంతంలో మన్సుఖ్ మృతదేహం .. నిన్న రాత్రి ఇంటి నుండి వెళ్ళిన మన్సుఖ్

థానేలోని రెతి బందర్ ప్రాంతంలో మన్సుఖ్ మృతదేహం .. నిన్న రాత్రి ఇంటి నుండి వెళ్ళిన మన్సుఖ్

మన్సుఖ్ హిరెన్ కల్వా క్రీక్‌లోకి దూకినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. హిరెన్ మృతదేహం థానేలోని రెతి బందర్ ప్రాంతంలో కనుగొనబడింది. నివేదికల ప్రకారం, గురువారం రాత్రి నుండి హిరెన్ ఇంటికి తిరిగి రాలేదు . ఇంటి నుండి బయలుదేరే ముందు హిరెన్ తన కుటుంబానికి ఎవరో 'సాహబ్'లను కలవబోతున్నట్లు తెలిపాడు. ఇప్పుడు శవమై తేలాడు . దీంతో ఈ కేసులో మరింత తీవ్రమైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి .

ముఖేష్ అంబానీపై కుట్ర .. కేసును ఎన్ఐఏ కు అప్పగించాలన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ముఖేష్ అంబానీపై కుట్ర .. కేసును ఎన్ఐఏ కు అప్పగించాలన్న మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

ఇదిలావుండగా, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మొత్తం సంఘటన వెనుక ఏదో కుట్ర ఉందని అభివర్ణించారు. దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కు అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కేసును తేలికగా తీసుకుందని, ముఖేష్ అంబానీ భద్రతను విస్మరించిందని అసెంబ్లీలో ఫడ్నవీస్ ఆరోపించారు. ఈ సంఘటనకు సంబంధించి సిఎం మరియు హోంమంత్రి తప్పనిసరిగా అసెంబ్లీలో ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు . పేలుడు పదార్థాలతో నిండిన కారు అంబానీ ఇంటి సమీపంలో ఉంది అంటే ఇది ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం ఎంత నిబద్దతతో ఉందో తెలియజేస్తుందని ఫడ్నవిస్ అన్నారు .

English summary
Mansukh Hiren, the man whose Scorpio was found abandoned outside Mukesh Ambani's home Antilia has been found dead. Naupada Police recovered Hiren's body on Friday. Initial inputs suggest that Mansukh Hiren died by suicide. Police officials believe he jumped into the Kalwa creek. Hiren's body was found in Reti Bandar area of Thane. According to reports, Hiren's was missing since Thursday night. Hiren had reportedly his family before leaving from home that he was going to meet some 'sahab' .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X