వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ వచ్చేస్తోందోచ్: రేట్ కూడా ఫిక్స్: ఇంకో మూడు నెలలే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌కు నిర్మూలన దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. క్లినికల్ ట్రయల్స్ తుదిదశలోకి వచ్చాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్ వారియర్లకు అందించే దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదార్ పూనావాలా వెల్లడించారు. ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.

Recommended Video

Covid-19 Vaccine : వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దేశంలో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌.. అందుబాటు ధరలో!
రూ.1,000ల ధర..

రూ.1,000ల ధర..

హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్-2020లో ఆయన మాట్లాడారు. దేశంలో చిట్టచివరి వ్యక్తి వరకూ కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేయడానికి సుదీర్ఘ సమయం పట్టొచ్చని అన్నారు. 2024 నాటికి ప్రజలందరికీ వ్యాక్సినేటెడ్ చేయడానికి వీలు ఉందని అన్నారు. వ్యాక్సిన్ ధరను గరిష్ఠంగా 1,000లుగా నిర్ధారించినట్లు ఆదార్ పూనావాలా తెలిపారు. వ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. తుదిదశ ట్రయల్స్ ముగింపుదశకు వచ్చినట్లు పేర్కొన్నారు.

హెల్త్‌కేర్ వర్కర్లకు..

హెల్త్‌కేర్ వర్కర్లకు..

తొలిదశలో హెల్త్‌కేర్ వర్కర్లు, కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్లు, వృద్ధులకు వ్యాక్సిన్‌ను అందజేస్తామని, వారందరికీ అవసరమైనన్ని డోసులను ఉత్పత్తి చేయడం, సరఫరా కోసం రెండునెలల సమయం పడుతుందని అన్నారు. ఏప్రిల్ నుంచి సాధారణ ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 1000 రూపాయలతో ఎవ్వరైనా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసుకునే పరిస్థితిని కల్పిస్తామని ఆదార్ పూనావాలా అన్నారు.

వ్యాక్సినేషన్ కోసం రెండేళ్లు..

వ్యాక్సినేషన్ కోసం రెండేళ్లు..

వ్యాక్సినేసన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి వ్యవస్థాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్పష్టం చేశారు. 130 కోట్ల మందికి పైగా గల దేశ జనాభాకు సరిపడేలా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం ఒక ఎత్తయితే.. దానికి అవసరమైన బడ్జెట్‌ను సమీకరించుకోవడం మరో ఎత్తుగా మారుతుందని అన్నారు. బడ్జెట్ అందుబాటులో ఉన్నా, ఉత్పత్తిని ముమ్మరం చేసినా.. వ్యాక్సిన్‌ సరఫరా, పంపిణీ, రవాణా, నిల్వ ఉంచుకోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని, వాటిని అధిగమించాల్సి ఉందని ఆయన అన్నారు.

ఒక్కో డోసు 5 నుంచి 6 డాలర్లు..

ఒక్కో డోసు 5 నుంచి 6 డాలర్లు..

ఆయా అంశాన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే.. వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికిి రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర 5 నుంచి 6 అమెరికన్ డాలర్లుగా నిర్దారించే అవకాశాలు ఉన్నాయని, అందుకే దేశీయ కరెన్సీలోకి వచ్చేసరికి దాని విలువ 1000 రూపాయలుగా నిర్ధారించాల్సి వచ్చినట్లు తెలిపారు. లక్షలాది డోసులను కొనుగోలు చేయాల్సి ఉన్నందున ధరను తగ్గించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని 3 నుంచి 4 డాలర్లకు ఒక్కో డోసును కొనుగోలు చేసేలా ప్రతిపాదించే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

English summary
Serum Institute of India's CEO Adar Poonawalla says Oxford COVID-19 vaccine should be available for healthcare workers, elderly people by around Feb 2021 and by April for general public. It will be priced at a maximum of Rs 1,000 for two necessary doses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X