వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కస్టడీ కంటిన్యూ .. సుప్రీంకోర్టులో చిదంబరానికి చుక్కెదురు.. సీబీఐ కస్టడీ మరో 4 రోజులు పొడిగింపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరం గడువును సుప్రీంకోర్టు పొడిగించింది. సెప్టెంబర్ 2 వరకు సీబీఐ కస్టడీలో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే సీబీఐ అధికారులు ఐఎన్ఎక్స్ మీడియా ముడుపులపై గత తొమ్మిది రోజులుగా విచారిస్తున్న సంగతి తెలిసిందే. మరో 4 రోజుల కస్టడీకి ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

హమ్మయ్య.. మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరానికి రిలీఫ్..!!హమ్మయ్య.. మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరానికి రిలీఫ్..!!

కస్టడీ కంటిన్యూ ..
ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో ఈ నెల 21న చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కస్టడీకి గడువు ఇవ్వాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరితే తొలుత 5 రోజులు .. తర్వాత మరో 4 రోజుల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. కస్టడీ గడువు ఇవాళ్టితో ముగియనున్న నేపథ్యంలో .. తమకు మరింత గడువు కావాలని సీబీఐ తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టును కోరడంతో ఈ మేరకు మరో 4 రోజుల కస్టడీకి ఇచ్చింది. ఇదే కేసులో మనీ ల్యాండరింగ్‌కు సంబంధించి ఈడీ దాఖలు చేసిన పిటిషన్ పై సెప్టెంబర్ 5న తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు తెలుపడంతో చిదంబరం ఊపిరి పీల్చుకున్నారు. కానీ వెంటనే సీబీఐ కేసులో కస్టడీ పొడిగించడం చిదంబరాన్ని మరింత ఇరుకున పెట్టింది.

P Chidambaram in SC offers to remain in CBI custody till Sept ..

నిన్న ఊరట ..
జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం చిదంబరం పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టాయి. ఈ సందర్భంగా చిదంబరాన్ని తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న చిదంబరం .. మరోసారి కస్టడీ గడువు పొడిగించిన సంగతి తెలిసిందే. ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నత ధర్మాసనం .. సెప్టెంబర్ 5న తీర్పు వెల్లడిస్తామని తేల్చిచెప్పింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసుకు సంబంధించి చిదంబరం ఢిల్లీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరాకరించడం .. సుప్రీంకోర్టు రెండురోజుల తర్వాత విచారిస్తామని చెప్పడంతో సీబీఐ అధికారులు అరెస్గ్ చేసిన సంగతి తెలిసిందే.

English summary
In an unprecedented plea, former finance minister P Chidambaram offered in the supreme court to remain in cbi custody till september2 in the inx media corruption case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X