వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అప్పుడు సీబీఐ ఆఫీస్‌ను ప్రారంభించి.. ఇప్పుడు అరెస్టై అక్కడికే..

|
Google Oneindia TeluguNews

Recommended Video

సీబీఐ కార్యాలయం లో చిదంబరం విచారణ || P.Chidambaram Taken Into Custody By CBI In INX Media Case

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ బుధవారం రాత్రి అరెస్టైన మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరంకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెరపైకి వచ్చింది. బుధవారం రాత్రి చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, గతంలో కేంద్రమంత్రిగా ఉన్న చిదంబరం సీబీఐ కార్యాలయ ప్రారంభోత్సంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం గమనార్హం.

2011లో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న చిదంబరం అదే సంవత్సరం జూన్ 30న ఢిల్లీలో కొత్త సీబీఐ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే, 8ఏళ్ల క్రితం ఏ సీబీఐ కార్యాలయం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారో.. అదే అదే కార్యాలయానికి చిదంబరంను అరెస్ట్ చేసి తరలించడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బుధవారం రాత్రి చిదంబరంను అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు గురువారం మధ్యాహ్నంలోగా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ఐఎన్ఎక్స్ మీడియా మనీలాండరింగ్ కేసులో చిదంబరంను సీబీఐ అధికారులు విచారించనున్నారు.

P Chidambaram lodged in same CBI complex he inaugurated- old videofootage

కాగా, 2011లో చిదంబరం హోంమంత్రిగా ఉన్న సమయంలో సోహ్రాబుద్దీన్ కేసులో గుజరాత్ హోంమంత్రి అమిత్ షాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే, ఇప్పుడు హోంమంత్రిగా అమిత్ షా ఉండగా.. చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

English summary
The then Union Home Minister, P Chidambaram at the inauguration of the new Central Bureau of Investigation (CBI) headquarters in Delhi on June 30, 2011. Chidambaram was arrested by CBI yesterday and brought to this complex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X