వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం దేశ వ్యతిరేక నేరం చేశారు, కస్టడీకి ఇవ్వాలి: కోర్టులో ఈడీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని, ఇది సమాజానికి, దేశానికి వ్యతిరేకమైన నేరమని ఎన్‌ఫోర్స్‌డైరెక్టరేట్(ఈడీ) గురువారం సుప్రీంకోర్టులో పేర్కొంది. ఇంత పెద్ద నేరానికి పాల్పడిన చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్ యాక్ట్ లేదా పీఎంఎల్ఏ చట్టం కింద కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని తెలిపింది.

వచ్చే నెల1 నుంచి కొన్ని భారతీయ వీసాలకు ఇంటర్వ్యూ తొలగింపు!వచ్చే నెల1 నుంచి కొన్ని భారతీయ వీసాలకు ఇంటర్వ్యూ తొలగింపు!

జస్టిస్ ఆర్ బానుమతి, ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం ఎదుట ఈడీ తన వాదనలు వినిపించింది. ఈ కేసులకు సంబంధించి సేకరించిన ఆధారాలను తాము ఇప్పుడే చూపలేమని తెలిపింది. అలా చేస్తే నిందితులు అప్రమత్తమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

P Chidambarams Offence Against Nation, Need His Custody: Probe Agency

ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టులో వాదించారు. ప్రీ అరెస్ట్ బెయిల్ దశలో ఉన్న నిందితుడికి తాము సేకరించిన ఆధారాలను చూపించాల్సిన అవసరం లేదని అన్నారు. విచారణ అనేది ప్రత్యేక జరుగుతోందని తెలిపారు. మనీలాండరింగ్ అనేది సమాజానికి, దేశానికి వ్యతిరేకమైన అంశమని, ఈ కుట్రను ఛేదించాల్సిన బాధ్యత ఈడీపై ఉందని చెప్పారు.

2009 నుంచి ఇప్పటి వరకు మనీలాండరింగ్‌కు సంబంధించిన మెటీరియల్ తన వద్ద ఉందని, అయితే, ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరంను విచారించిన మరిన్ని వివరాలను రాబట్టాలని ఈడీ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. చిదంబరంకు బెయిల్ ఇవ్వకుండా కస్టడీకి ఇవ్వాలని కోరారు. కాగా, ప్రస్తుతం చిదంబరంను సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో వారం రోజుల క్రితం చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టులో చిదంబరం పిటిషన్ వేయగా.. ఆ కోర్టు తిరస్కరించింది. దీంతో సీబీఐ చిదంబరంను అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టులో కూడా చిదంబరంకు నిరాశే ఎదురైంది. దీంతో మరోసారి సీబీఐ చిదంబరంను విచారిస్తోంది.

చిదంబరం లాయర్ కపిల్ సిబల్ మాత్రం ఏ ఆధారాలు లేకుండానే చిదంబరంను కస్టడీకి ఇవ్వడం సరికాదంటూ వాదించారు. సాధారణ విచారణకు హాజరవుతుండగా.. మళ్లీ కష్టడీకి ఎందుకని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీలపై సిబల్ తీవ్రంగా మండిపడ్డారు. ఎప్ఐఆర్ నమోదై రెండేళ్లైనా చిదంబరంకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Money laundering is an offence against "society and nation", the Enforcement Directorate or ED told the Supreme Court today and said it needed custodial interrogation of former finance minister P Chidambaram to unearth the larger conspiracy in the INX Media money case under the Prevention of Money Laundering Act or PMLA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X