వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉల్లిగడ్డ తినావా? ఆ పండు తింటుందా? నిర్మలా సీతారామన్‌పై చిదంబరం సెటైర్

|
Google Oneindia TeluguNews

పార్లమెంట్ సమావేశాలను ఉల్లిధర కుదిపేసింది. పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు అధిర్ చౌదరీ, గౌరవ్ గగొయ్ తదితర సభ్యులు ఆందోళన చేపట్టారు. ఉల్లిధరను నియంత్రించలేని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ బ్యానర్లు ప్రదర్శించారు. పెద్ద పెట్టున్న సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉల్లిగడ్డల గంపతో పార్లమెంట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ పేద ప్రజలను పీడించడం ఆపాలని కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు.

ఒక్క కేసు పెట్టకుండా.. 106 రోజుల జైలులో.. మాజీ కేంద్రమంత్రి చిదంబరంఒక్క కేసు పెట్టకుండా.. 106 రోజుల జైలులో.. మాజీ కేంద్రమంత్రి చిదంబరం

Recommended Video

News Roundup : Chidambaram Satires On Nirmala Sitharaman Comments Over Onion Prices !
 నిర్మలా సీతారామన్‌పై సెటైర్లు

నిర్మలా సీతారామన్‌పై సెటైర్లు

ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన మాజీ కేంద్రమంత్రి చిదంబరం పార్లమెంట్‌లో తనదైన శైలిలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై సెటైర్లు వేశారు. గురువారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన చిదంబరం ఉల్లిగడ్డ ధరపై ఘాటుగా స్పందించారు. తాను ఉల్లిగడ్డ తనని ఫ్యామిలీ నుంచి వచ్చానని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ.. మీరు ఉల్లిగడ్డ తినదా.. ఆమె అవకాడో పండు తింటారా? అని చిదంబరం చురకలు అంటించారు.

నా గొంతు నొక్కలేరు..

నా గొంతు నొక్కలేరు..

పార్లమెంట్‌లో చిదంబరం సమావేశాల్లో హుషారుగా పాల్గొన్నారు. బయట తన గొంతును నొక్కినా.. పార్లమెంట్‌లో ఆ పని చేయలేరు అని అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న తొలిరోజునే చిదంబరం ఉల్లిగడ్డ ధరలపై స్పందిస్తూ సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్లమెంట్ బయట చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ ధర్నాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎంపీ సుబ్బిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 రూ.150కి ఉల్లిధర

రూ.150కి ఉల్లిధర

దేశవ్యాప్తంగా ఉల్లిధరలు సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఉల్లి సుమారు రూ.100 నుంచి రూ.150 రూపాయల ధర పలుకుతున్నది. హైదరాబాద్‌లోనే ఉల్లిధర రూ.150కి చేరుకొన్నది. దాంతో ఉల్లిధర పెరగడంపై అన్ని వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

చిదంబరానికి స్టాలిన్ ఫోన్

చిదంబరానికి స్టాలిన్ ఫోన్

ఇదిలా ఉండగా.. జైలు నుంచి విడుదలైన చిదంబరంకు డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ గురువారం పరామర్శించారు. స్టాలిన్ ఉదయం ఫోన్‌లో మాట్లాడి చిదంబరం ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకొన్నారు. ఐఎన్‌ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో చిదంబరంను ఆగస్టు 21వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో సుమారు 106 రోజులపాటు ఆయన తీహార్ జైలులో గడిపారు.

English summary
Former Minister P Chidambaram satires finance minister Nirmala Sitharaman, If not Onion, Does she eat avocados?.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X