వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసులేమో పెద్దవి.. కోర్టు హాల్ చిన్నది... బోనులో చిదంబరం ఆశ్చర్యం

|
Google Oneindia TeluguNews

సీబీఐ అంటే పేరుకే పవర్ ఫుల్, దాని వసతులు చూస్తే చాలా నిల్, ఇదే విషయం ఇప్పుడు మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి అర్థమయింది. ఢీల్లీలోని రౌజ్ ఎవెన్యూలోని కోర్టు హళ్లను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద కేసులు వాదించే సీబీఐ కోర్టు హళ్లు ఇంత చిన్నగా ఉన్నాయా అంటూ సీబీఐ అధికారులను అడిగారు. కొత్తగా నిర్మించనవి కావడంతో చాల విశాలంగా ఉంటాయని భావించానని వారితో చెప్పారు. దీంతో అసలు విషయాన్ని అధికారులు వివరించారు.

పేరుకే సీబీఐ, కాని సౌకర్యాలు మాత్రం నిల్,

పేరుకే సీబీఐ, కాని సౌకర్యాలు మాత్రం నిల్,

పేరుకేమో సీబీఐ కోర్టు ,అత్యున్నత స్థాయిలో కేసులు,పెద్ద పెద్ద నేరాలు చేసిన ఆర్థిక వేత్తలు, రాజకీయ నాయకులతోపాటు వైట్ కాలర్ నేరాగాళ్ల కేసులను సీబీఐ చేదించి, విచారిస్తోంది. ప్రతి కేసు కూడ వందల కోట్లకు సంబందించినది ఉంటుంది. దీంతో సీబీఐ కేసులు అంటే బడా బడా వ్యక్తులే సీబీఐ కేసుల్లో ఇరుక్కుంటారు..దీంతో పేరుమోసిన లాయర్లు, వాదనలు వినిపిస్తారు...దీంతో అవి చాల విశాలంగా, లక్జోరియస్‌గా ఉంటాయని సీబీఐ కోర్టు మెట్లక్కని వారెవ్వరైనా అనుకుంటారు... ఇలాగే నేడు మొదటి సారిగా సీబీఐ కోర్టు మెట్లెక్కిన చిదంబరం కూడ ఇలాగే ఫీలయ్యాడు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం హళ్లను చూసిన తర్వాత చిదంబరం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు హాళ్లు ఇంత చిన్నగా ఉన్నాయోంటని సీబీఐ అధికారులను అడిగారు. ఇటివల కోర్టు ప్రారంభించిన కోర్టు భవనం కావడంతో చాల విశాలంగా ఉంటాయని భావించానని చెప్పారు.

పెద్ద కేసుల్లో కనీసం అడ్వకేట్స్ కూర్చునే అవకాశం లేదు

పెద్ద కేసుల్లో కనీసం అడ్వకేట్స్ కూర్చునే అవకాశం లేదు

ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు సైతం స్పందించారు. అవును కోర్టు హళ్లు చాల చిన్నగా ఉన్నాయి. ఇందులో బోగ్గు కుంభణంతో పాటు పలు పెద్ద పెద్ద కేసులు వాదించే సమయంలో ఇబ్బందులు ఎదుర్కోన్నామని, కనీసం కోర్టు లోపలి హాల్లో నిందితుడి తరుఫున వాదించే అడ్వకేట్స్ కూడ కూర్చునేందుకు సాధ్యం కాలేదని వివరించారు. అయితే ఈ సంవత్సరం ఎప్రిల్ నెలలో కోర్టు భవనాన్ని ప్రారంభించారు. సీబీఐ ,ఏసీబీ, లేబర్ కోర్టులు లాంటివన్ని ఓకే బిల్డింగ్‌లో ఉండాలని ఢిల్లీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో రౌజ్ ఎవెన్యూ కాంప్లెక్స్‌లోనే కోర్టు భవనాలు కొనసాగుతున్నాయి.

జైళ్లు ఇంకా చిన్నగా ఉంటాయి.. అప్పుడు చిదంబరం మరింత అశ్చర్యపడాలి.

జైళ్లు ఇంకా చిన్నగా ఉంటాయి.. అప్పుడు చిదంబరం మరింత అశ్చర్యపడాలి.

అయితే చిదంబరం చేసిన వ్యాఖ్యలపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. చిదంబరం మరో అశ్యర్యాన్ని వ్యక్తం చేయాల్సి ఉంటుందని, కోర్టు హాళ్ల కంటే ఇంకా చిన్నగా జైళ్లు ఉంటాయిని వ్యాఖ్యానించారు...ఐఎన్ఎక్స్ మీడీయా కేసులో మనిలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కోంటున్న కేంద్ర మాజీమంత్రి పీ.చిదంబరాన్ని బుధవారం రాత్రీ సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. దీంతో ఆయన్ను రాత్రి మొత్తం సీబీఐ కార్యాయంలోని అతిధి గృహంలోనే ఉంచారు. ఇక నేడ మధ్యహ్నాం తర్వాత ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూలో కాంప్లెక్స్‌లో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. దీంతో ఆయన కోర్టు హలులోనే ఉన్నారు.. మధ్యహ్నాం నుండి సాయంత్రం 6.30వరకు అక్కడే గడిపారు.

English summary
former Union minister P Chidambaram was in surprise when he was produced before the special CBI court in the Rouse Avenue Complex in New Delhi today. Chidambaram, in conversation with CBI officers, expressed surprise that the courtrooms in the new complex were very small.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X