వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పద్మ’ అవార్డులు ప్రకటించిన కేంద్రం, ఇళయరాజాకు ‘పద్మ విభూషణ్’

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి గురువారం సాయంత్రం కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Padma awards 2018 : పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ గ్రహీతలు !

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2018కి చెందిన పద్మ అవార్డులు ప్రకటించింది. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి గురువారం సాయంత్రం కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది.

9 మందికి పద్మభూషణ్, 73 మందికి పద్మశ్రీ, ముగ్గురికి పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించారు. పద్మ విభూషణ్ దక్కించుకున్న వారిలో మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్కరిని పద్మ అవార్డు లభించింది. తెలంగాణలో ఎవరికీ అవార్డు దక్కలేదు. ఏపీ నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ కు పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.

పద్మశ్రీ అవార్డు పొందిన వారిలో... మహారాష్ట్రకు చెందిన శాస్త్రవేత్త అరవింద్‌ గుప్తాకు, కేరళకు చెందిన లక్ష్మీకుట్టికి, ఎం.ఆర్‌ రాజగోపాల్‌కు, కర్ణాటకకు చెందిన సలగత్తి నరసమ్మకు, హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన యేషి ధోడెన్‌కు వైద్యరంగంలో పద్మశ్రీని కేంద్రం ప్రకటించింది.

padma-awards

ఇంకా.. మధ్యప్రదేశ్‌కు చెందిన భజ్జు శ్యామ్‌కు కళారంగంలో పద్మశ్రీ ఇవ్వనున్నట్టు పేర్కొంది. బెంగాల్‌కు చెందిన సుధాన్షు బిశ్వాస్‌కు సేవారంగంలో, బెంగాల్‌కు చెందిన సుభాషిని మిస్త్రీకి సామాజిక సేవలో, సాహిత్య రంగంలో విజయలక్ష్మీకి పద్మశ్రీని అందించనున్నారు.

తమిళనాడుకు చెందిన రాజగోపాలన్‌ వాసుదేవన్‌కు, మహారాష్ట్రకు చెందిన మురళీకాంత్‌ పటేకర్‌ పద్మశ్రీని ప్రకటించింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం జరుగనుంది. మరికాసేపట్లో పద్మ అవార్డులపై కేంద్రం అధికారిక ప్రకటన చేయనుంది.

'మ్యూజిక్ మేస్ట్రో' ఇళయ రాజాకు 'పద్మ విభూషణ్'...

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాను తాజాగా కేంద్ర ప్రభుత్వం 'పద్మ విభూషణ్' అవార్డుతో సత్కరించింది. తమిళనాడు రాష్ట్రంలోని పన్నైపురంలో జన్మించిన ఇళయరాజా దాదాపు 5 వేల పాటలకు సంగీతం అందించారు. 2010లో కేంద్రం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 2018లో ఇళయరాజాకు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది.

సినీ సంగీతానికి చేసిన కృషికిగాను ఇళయరాజా 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రసేకరేంద్ర సరస్వతి నేషనల్ ఏమినేన్సు పురస్కారం, 2015లో గోవాలో జరిగిన 46వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియాలో జీవితకాల సాఫల్య పురస్కారం కూడా అందుకున్నారు.

English summary
The Centre on Thursday announced the list of this year’s Padma awardees. The list of awardees include ‘Grandmother of Jungle’ Lakshmikutty, scientist toymaker Arvind Gupta, Gond artist Bhajju Shyam, ‘father of palliative care in India’ MR Rajagopal and 98-year-old social worker Sudhanshu Biswas. The awards — Padma Vibhushan, Padma Bhushan and Padma Shri — are announced on the eve of the Republic Day every year. They are given in different fields and disciplines such as art, literature and education, sports, medicine, social work, science and engineering, public affairs, civil service, trade and industry. More than 15,700 people applied for the prestigious awards for 2018, with the government laying stress on honouring the unsung heroes, an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X