వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పద్మభూషణ్ అవార్డు, రూ. 10 కోట్లు బ్లాక్ మనీ, సీబీఐ కేసు !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ముంబై: పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ముంబైలోని ప్రముఖ వైద్యుడి మీద సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. రూ. 10 కోట్ల పాత పెద్ద నోట్లు (రూ.1,000, రూ.500) అక్రమంగా తరిస్తున్న సమయంలో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు.

పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన వైద్యుడుతో సహ సురేష్ అద్వాని, యోగేష్ శిరోయ్, ధరం రాజ్ తిలక్, క్రిష్, గజానంద్ సోమ్ నాథ్, డిఎం. షా మీద కేసు నమోదు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.

ఈ కేసులో పద్మభూషణ్ అవార్డ గ్రహీత అయిన వైద్యుడి పాత్ర ఏమిటి ? అని ఆరా తీస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. ముంబైలో ప్రముఖ వైద్యుడు అయిన ఆయనకు 2002లో పద్మశ్రీ, 2012లో పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి.

Padma Bhushan awardee has been booked by the CBI in the ongoing crackdown against black money.

అరెస్టు అయిన వారిలో యోగేష్ మినహా మిలిగిన నిందితులు అందరూ వైద్యనాథ్ కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు అని సీబీఐ అధికారులు తెలిపారు. నిందితులు రూ. 10 కోట్ల బ్లాక్ మనీ తరలిస్తున్న సమయంలో వారిని ముంబైలోని ఫార్ట్కోషర్ ప్రాంతంలో సీబీఐ అధికారులు పట్టుకున్నారు.

మహారాష్ట్రలోని స్టేట్ అర్జున్ కో ఆపరేటివ్ బ్యాంకులో వీరు రూ. 15 కోట్లు నగదు డిపాజిట్ చేశారని మా దగ్గర సమాచారం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు. ఫార్ట్కోషర్ బ్రాంచ్ లో రూ. 25 కోట్లు డిపాజిట్ చెయ్యడానికి ప్రయత్నించారని అధికారులు చెప్పారు.

అయితే ఆ బ్యాంకులో కేవలం రూ. 15 కోట్లు మాత్రం డిపాజిట్ చెయ్యడానికి అవకాశం ఉందని, మిగిలిన రూ. 10 కోట్లు వేరే బ్యాంకులో డిపాజిట్ చెయ్యడానికి వెలుతున్న సమయంలో తాము అరెస్టు చేశామని సీబీఐ అధికారులు తెలిపారు.

English summary
A top doctor from Mumbai who is a Padma Bhushan awardee has been booked by the Central Bureau of Investigation in the ongoing crackdown against black money. TThe CBI registered the case after it was found that they were fraudulently transporting demonetised currency to the tune of Rs 10 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X