వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ ఓనమాలు దిద్దించిన కోచ్‌ ఆధ్వర్యంలో కోహ్లీకి సన్మానం

మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం, పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కోహ్లిని తన చిన్ననాటి శిక్షణ అకాడమీ ‘పశ్చిమ ఢిల్లీ క్రికెట్‌ అకాడెమీ’ గౌరవంగా సత్కరించింది.

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడెమీ ఆదివారం ఘనంగా సత్కరించింది. మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం, పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కోహ్లిని తన చిన్ననాటి శిక్షణ అకాడమీ 'పశ్చిమ ఢిల్లీ క్రికెట్‌ అకాడెమీ' గౌరవంగా సత్కరించింది.

ఈ కార్యక్రమానికి కోహ్లీని క్రికెట్‌లో ఓనమాలు దిద్దించిన రాజ్‌కుమార్ శర్మ, భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్‌లతో పాటు ఐపీఎల్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోహ్లీ సోదరుడు వికాస్‌తో పాటు తల్లి సరోజ్‌ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ‘Padma Shri’ Virat Kohli gets felicitated by childhood academy

విరాట్ కోహ్లీని ఢిల్లీ రంజీ జట్టులోకి తీసుకున్నప్పుడు వాసన్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ కోచ్ రాజ్‌కుమార్‌ శర్మ మాట్లాడుతూ కోహ్లీలోని నైతిక విలువలు, క్రమశిక్షణ ఈరోజు ఈ స్థాయికి చేర్చేలా చేశాయని అన్నాడు. అన్ని ఫార్మాట్లలో కోహ్లీ గొప్ప ఆటగాడిగా రూపొందేలా చేశాయన్నాడు.

ఇక కోహ్లీ ప్రతిభను నేడు ప్రపంచం గుర్తించడం చాలా గర్వంగా ఉందని ఆయన అన్నారు. ఇక ఈ సన్మాన కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడుతూ 'నేను రాజ్‌కుమార్‌ గారి వద్ద 19ఏళ్లు శిక్షణ పొందాను. నా మూలాలు అకాడమీలోనే ఉన్నాయి. అక్కడికి వెళ్లిన ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకున్నాను' అని కోహ్లి పేర్కొన్నాడు.

English summary
Virat Kohli had a stupendous 2016, where he finished as the top run-getter across formats. Team India did not lose a single Test series under him and even attained the No. 1 spot in Test Rankings
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X