వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విరిసిన ప‌ద్మాలు, 112 మందికి అవార్డులు: న‌లుగురు తెలుగు ప్ర‌ముఖుల‌కు ప‌ద్మ‌శ్రీలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ప‌ద్మ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పురస్క‌రించుకొని వివిధ రంగాల్లో విశేష సేవ‌లంతించిన ప్ర‌ముఖ‌ల‌కు కేంద్రం ఈ ప‌ద్మ పురస్కారాల‌కు ఎంపిక చేసింది. ఈ ఏడాది కేం ద్ర ప్ర‌భుత్వం న‌లుగురికి ప‌ద్మ విభూష‌న్, 14 మందికి ప‌ద్మ భూష‌ణ్, 94 మందికి ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాను ప్ర‌క‌టించింది. కేంద్రం ప్ర‌క‌టించిన ప‌ద్మ పుర‌స్కారాల్లో నలుగురు తెలుగు వారు ఉన్నారు.

ప‌ద్మ విభూష‌ణ్ - ప‌ద్మ భూష‌ణ్ అవార్డులు వీరికే..

ప‌ద్మ విభూష‌ణ్ - ప‌ద్మ భూష‌ణ్ అవార్డులు వీరికే..

కేంద్రం ప్ర‌క‌టించిన ప‌ద్మ విభూష‌ణ్ అవార్డులు న‌లుగురికి ద‌క్కాయి. వారిలో టీజెన్‌ బాయ్‌, ఇస్మాయిల్‌ ఒమర్‌ గులే, అనిల్‌కుమార్‌ మణీబాయ్‌ నాయక్‌, బల్వంత్‌ మోరేశ్వర్‌ పురంధరేకు పద్మవిభూషణ్‌ ప్రకటించారు. సుఖ్‌దేవ్‌ సింగ్‌ దిందా, మహాశయ దారమ్‌ పాల్‌, దర్శన్‌లాల్ జైన్‌, అశోక్‌ లక్ష్మణ్ రావు, కరియా ముండా, బుద్దాదిత్య ముఖర్జీ, నటుడు మోహన్‌లాల్‌, నంబినారాయణ్, కుల్దీప్‌ నయ్యర్‌, మిసెస్‌ బచేంద్రపాల్‌, వీకే షుంగ్లా, హుకుందేవ్‌ నారాయణ్‌, జాన్‌ చాంబర్స్‌ (అమెరికా), ప్రవీణ్‌ గోర్దాన్‌ (సౌతాఫ్రికా)కు పద్మభూషణ్‌ ప్రకటించారు.

94 మంది ప్రముఖులకు పద్మశ్రీ..

94 మంది ప్రముఖులకు పద్మశ్రీ..

కేంద్రం వివిధ రంగాల‌కు చెందిన 94 మంది ప్ర‌మ‌ఖుల‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డులు ప్ర‌క‌టించింది. అందులో ఫుట్‌బాల్‌ క్రీడా కారుడు సునీల్‌ చత్రీ, చెస్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక , డాన్స్‌ మాస్టర్ ప్రభుదేవా, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, యెండవల్లి వెంకటేశ్వరరావు, మనోజ్ బాజ్‌పాయ్, గౌతమ్ గంభీర్‌, గీతా మెహ‌తా, సునీల్ షెట్రి, మోహ‌న్ లాల్,శంత‌ను నారాయ‌ణ‌న్‌, రామ‌స్వామి వెంక‌ట‌స్వామి, అబ్దుల్ గ‌ఫార్ ఖాత్రి వంటి ప్ర‌ముల‌కు పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు.

నలుగురు తెలుగు ప్రముఖులను పద్మశ్రీ ..

నలుగురు తెలుగు ప్రముఖులను పద్మశ్రీ ..

2018 సంవత్సరానికి గాను నలుగురు తెలుగు ప్రముఖులను పద్మశ్రీ అవార్డులు వరించాయి. ప్రముఖ సినీగేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, ద్రోణవల్లి హారిక, యడ్లపల్లి వెంటేశ్వరరావు, సునీల్‌ ఛెత్రికు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వీరిని ఇరువురు ముఖ్య‌మంత్రులు అభినందించారు. సిరివెన్న‌ల సీతారామ శాస్త్రి అనేక వంద‌ల పాట‌ల ను రాసిన గేయ ర‌చ‌యిత‌. ద్రోణ‌వ‌ల్లి హారిక చిన్న వ‌య‌సులోనే చెస్ క్రీడ‌లో జాతీయ - అంత‌ర్జాతీయ పోటీల్లో విశేష ప్ర‌తిభ క‌న‌ప‌రిచి..ఎన్నో ప‌త‌కాల‌ను తీసుకొచ్చారు. ఇక‌, టిడిపి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వ‌క‌పోవ‌టం పై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేసారు. తెలుగు ఖ్యాతిని చాటిన వీరికి శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్లు ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు.

English summary
Central Govt announced Padma awards. Padma Vibhushan for 4 members, Padma Bhushan for 14 members, Padmasri for 94 members announced. Telugu people got 4 padmasri awards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X