వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరికొన్ని గంటల్లో ‘పద్మావత్‌’ విడుదల.. ఉత్తర భారతంలో మిన్నంటిన ఆందోళన!

దేశవ్యాప్తంగా పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఆ సినిమాను బ్యాన్ చేసిన నాలుగు రాష్ట్రాలు ఆందోళనలు, హింసాత్మక చర్యలతో అట్టుడుకుతున్నాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పద్మావత్ సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఆ సినిమాను బ్యాన్ చేసిన నాలుగు రాష్ట్రాలు ఆందోళనలు, హింసాత్మక చర్యలతో అట్టుడుకుతున్నాయి.

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తీసిన పద్మావత్ సినిమా ఆందోళన, నిరసనల నడుమ గురువారం దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ఒకరోజు ముందు హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది.

దుకాణాల ధ్వంసం, వాహనాలకు నిప్పు...

దుకాణాల ధ్వంసం, వాహనాలకు నిప్పు...

పద్మావత్ సినిమాపై నిరసనలు, ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి హింసకు పాల్పడుతున్నారు. వాహనాలకు నిప్పు పెడుతున్నారు. షాపులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో యూపీలోని ఇటావాలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. అటు ఢిల్లీ, జైపూర్ హైవేపై ఆందోళన చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కర్ణిసేన.. దేశవ్యాప్తంగా సినిమా విడుదలను అడ్డుకోవాలని మరోసారి పిలుపునిచ్చింది.

సినిమా విడుదలకు నో చెప్పిన డిస్ట్రిబ్యూటర్లు...

సినిమా విడుదలకు నో చెప్పిన డిస్ట్రిబ్యూటర్లు...

రాజస్థాన్‌లో ఆందోళనల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు సినిమాను విడుదల చేయడానికి వెనుకడుగు వేశారు. ఢిల్లీ, జైపూర్ హైవేతోపాటు, ఢిల్లీ, అజ్మేర్ హైవేలపై ఆందోళనకారులు రోడ్లపై టైర్లు తగలబెట్టారు. సికార్‌లో బస్సుపై రాళ్లు రువ్వారు. కర్ణిసేన సభ్యులు లోపలికి రావడానికి ప్రయత్నించడంతో చరిత్రలో కేవలం రెండోసారి చిత్తోరగఢ్ కోటను మూసేశారు. ముంబైలో ముందస్తు జాగ్రత్తగా 30 మంది కర్ణిసేన సభ్యులను అరెస్ట్ చేశారు. అటు అహ్మదాబాద్‌లోనూ 44 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి...

ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి...

హర్యానాలోని గుర్గావ్‌లో వజీర్‌పూర్-పటౌడీ రోడ్డును ఆందోళనకారులు మూసేశారు. సోహ్నాలో ఓ బస్సుకు నిప్పంటించారు. ఆదివారం వరకు థియేటర్లకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ఆందోళనలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు థియేటర్ల ఓనర్లు సినిమా రిలీజ్‌కు నో చెప్పారు. లక్నోలోనూ రోడ్లపైకి వచ్చి సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు.

వణికిపోయిన చిన్నారులు...

వణికిపోయిన చిన్నారులు...

పద్మావత్‌ సినిమాకు వ్యతిరేకంగా హర్యానాలో ఆందోళనలు బుధవారం తారస్థాయికి చేరాయి. విచక్షణ మరచిన ఆందోళనకారులు స్కూల్‌ పిల్లల బస్సుపై దాడికి దిగారు. జీడీ గోయెంకా వరల్డ్‌ స్కూల్‌ బస్సుపై రాళ్ల దాడి చేయడంతో బస్సులోని పిల్లలు హడలిపోయారు. దాడి జరిగిన సమయంలో రెండో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, టీచర్లు బస్సులో ఉన్నట్లు తెలిసింది. రాళ్ల దాడి నుంచి తప్పించేందుకు వారంతా సీట్లలో నుంచి లేచి బస్సు లో ఫ్లోర్‌పై పడుకున్నారు. ఈ సంఘటనను ఓ విద్యార్థి తన మొబైల్‌లో వీడియో కూడా తీశాడు. భయంతో కేకలు వేస్తున్న ఓ బాలికను టీచర్‌ గట్టిగా కౌగిలించుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన సమయంలో చుట్టుపక్కల పోలీసులు ఉన్నా పట్టించుకోలేదని జీడీ స్కూల్‌ టీచర్‌ ఆరోపించారు.

English summary
After the top court's unequivocal order yesterday rejecting the final attempts by Rajasthan and Madhya Pradesh to ban the film 'Padmaavat'', protests against the release of the movie turned violent. Chief Justice of India Dipak Misra stressed "People can't come and say law and order problems, ban the movie. Let us not come to a state where the exhibition of a movie, despite certified by the censor board, is crippled." Groups of people vandalised shops at a mall and a cinema hall in Ahmedabad and targeted vehicles parked. Nearly a dozen two-wheelers, many of them belonging to a fast-food chain, were gutted. Section 144 has also been imposed in Gurgaon till Sunday to maintain law and order. Police also had to fire two shots in the air to disperse the mob. The Karni Sena, which has been spearheading the protests against the film, responded to a letter by Sanjay Leela Bhansali productions and disclosed that a six member panel would watch the film before its release as proposed by the filmmakers. Police presence has been beefed up a day ahead of the film's release.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X