వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'పద్మావతి' వివాదం: మృతుడి మొబైల్‌తో మిస్టరీ వీడేనా....

By Pratap
|
Google Oneindia TeluguNews

జైపూర్: నహరగఢ్ వద్ద ఉరేసుకున్న 40 ఏళ్ల వ్యక్తి మిస్టరీని ఛేదించడానికి అతని మొబైల్ ఫోన్ కీలకమైన ఆధారం అవుతుందని అంటున్నారు. అతని మృతికి సంబంధించిన మిస్టరీ దానివల్ల వీడే అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

మరణానికి ముందు చేతన్ సైనీ సెల్పీలు తీసుకున్నాడు. అవి ఏ మాత్రం చెక్కు చెదరలేదని అంటున్నారు. ఆ ఫోన్‌ను పోలీసులు పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించారు. ఆన్‌లైన్‌లో వీడియోలను ఏమైనా అప్‌లోడ్ చేశాడా అనే విషయాన్ని పరిశీలించాలని కూడా పోలీసులు ఎఫ్ఎస్ఎల్ అధికారులను కోరారు.

Padmavati row: Chetan Saini’s mobile phone with selfies may prove crucial

సైనీ గురువారంర సాయంత్రం మూడున్నర గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. మర్నాడు స్థానికులు నహర్‌‌గఢ్ కోట గోడలకు వేలాడుతున్న శవాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. అతని చొక్కా జేబులో కొన్ని వస్తువులతో పాటు మొబైల్ ఫోన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు.

కోట గోడ బ్యాక్‌గ్రౌండ్‌గా సైనీ తన మొబైల్ ఫోన్‌తో కొన్ని సెల్పీలు తీసుకున్నాడు. దాన్ని విశ్లేషణ కోసం వెంటనే ఎఫ్ఎస్ఎల్‌కు పంపించినట్లు పోలీసు అధికారులు చెప్పారు. అతను మద్యం సేవించి ఉన్నాడా, లేదా అనే విషయం కూడా ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలుతుందని చెప్పారు.

English summary
The mobile phone of the 40-year-old man, whose body was found hanging from one of the walls of Nahargarh fort, is going to be very crucial in solving the mystery surrounding his death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X