బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పద్మావతి చిత్రం ఎఫెక్ట్, బెంగళూరులో నటి దీపికా పదుకొణె ఫ్యామిలీకి భారీ బందోబస్తు, 24x7!

బాలీవుడ్ చిత్రం పద్మావతి ఎఫెక్ట్, తల నరకండి, వివాదాలు.బెంగళూరులో నటి దీపికా పదుకొణె ఇంటికి భారీ బందోబస్తు.24 గంటలు దీపికా పదుకొణె కుటుంబ సభ్యులకు రక్షణ, ప్రాణహాని ఉందని !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కొతం కాలంగా వివాదాలు ఎదుర్కొంటున్న పద్మావతి చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన దీపికా పదుకొణె ఇంటికి బెంగళూరు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీపికా పదుకొణె కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కర్ణాటక హోం శాఖా మంత్రి రామలింగా రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు.

పద్మావతి చిత్రంలో టైటిల్ పాత్రలో నటించిన దీపిక పదుకొణె తల నరికి తెస్తే రూ. 10 కోట్లు, రూ. 5 కోట్లు రివార్డు ఇస్తామని కొందరు ప్రకటిస్తున్నారు. పద్మావతి సినిమా విడుదల కానివ్వమని, దీపికా ముక్కుకోస్తామని హెచ్చరిస్తూ కర్ణిసేన సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. పద్యావతి సినిమా విడుదలను మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఇప్పటికే నిషేధించాయి.

Padmavati row security deployed at actress Deepikas Padukone family home in Bengaluru

సుప్రీం కోర్టు మాత్రం పద్మావతి చిత్రానికి అండగా నిలిచింది. పద్మావతి చిత్రం ఇంకా సెన్సార్ కు వెళ్లలేదని, అంతకు ముందే విమర్శలు చెయ్యడం సబబుకాదని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. దీపికా పదుకొణెకు ప్రాణహాని ఉందని వెలుగు చూసిన సందర్బంగా బెంగళూరులోని జేసీ నగరలోని నంది దుర్గ రోడ్డులోని ఫుడ్స్ వేల్ అపార్ట్ మెంట్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అపార్ట్ మెంట్ లో దీపికా పదుకొణె కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు.

English summary
A day after the Bharatiya Janata Party’s chief media coordinator for Haryana offered a reward to anyone who beheads Deepika Padukone for her role in the film Padmavati, the Congress government in Karnataka the actor’s home State has provided round the clock security at her family home here in Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X