వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాయాది .. ఆధారాలివిగో ... పాక్ వల్లెవేసిన అబద్ధాలపై త్రివిధ దళాలు ఎదురుదాడి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : భారత్ నుంచి విడిపోయాక పాకిస్థాన్ తన ఉనికి, అస్థిత్వాన్ని మరచిపోయింది. ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తూ .. టెర్రరిజం అంటే పాకిస్థాన్ అనేలా వ్యవహరిస్తోంది. కానీ పైకి మాత్రం శాంతి, అహింస అని చెబుతూ .. లోలోన మాత్రం కరడుగట్టిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి, కపట నాటకాన్ని ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతూనే ఉంది. అమెరికా, చైనా సపోర్ట్ తో ఇన్నాళ్లు ఉగ్రవాదుల డెన్ గా మారింది. పుల్వామా దాడి తర్వాత భారత్ ధీటుగా స్పందించింది. యుద్ధం తప్పదనే సంకేతాలు ఇచ్చింది. ఇకపై తాము శాంతి అని చూస్తూ కూర్చొబోమని ఖరాకండిగా తేల్చిచెప్పింది.

వింగ్ కమాండర్ అభినందన్ వీడియోలు డిలీట్ చేయండి: యూట్యూబ్‌కు విజ్ఞప్తివింగ్ కమాండర్ అభినందన్ వీడియోలు డిలీట్ చేయండి: యూట్యూబ్‌కు విజ్ఞప్తి

దీంతోపాటు పాకిస్థాన్ ఉగ్రవాదులకు అండగా నిలుస్తోందని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి మద్దతు కూడగట్టింది. భారత్ వ్యుహం, దౌత్యం, మన సైనిక సామర్థ్యం, ఆధునాతన సాంకేతిక పరికరాల గురించి తెలిసి .. తోకముడిచింది. తన వద్ద బందీగా ఉన్న అభినందన్ ను విడిచిపెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో అమెరికా, రష్యా జోక్యం .. పాకిస్థాన్ కపటనీతిని భారత్ ఎండగట్టడంతో .. ఇండియా హీరోలా నిలిచి .. ఊసరవెల్లి పాకిస్థాన్ దోషిగా బోనులో నిలబడింది. ఇదంతా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు .. కానీ పాకిస్థాన్ ఎప్పుడూ తప్పుదోవ పట్టిస్తూ .. నిమిషానికో మాట మాట్లాడుతూ .. తనది నాలికేనా లేదా తాటిమట్ట అని చేష్టలతో నిరూపించుకుంది.

అబద్దాలను వల్లెవేసింది ..

అబద్దాలను వల్లెవేసింది ..

ప్రశాంతంగా ఉన్న ఉప ఖండం పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ఆ తర్వాత మాత్రం పాకిస్థాన్ పదే పదే అబద్దాలు చెప్పింది. ఎప్పుడూ కయ్యానికి కాలుదువ్వే పాకిస్థాన్ .. తన దేశంలో జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను పాలుపోసి పెంచుతోంది. పుల్వామాలో దాడి .. ఆ వెంటనే జైషే మహ్మద్ సంస్థ తామే దాడి చేశామని చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఓ దేశంలోని జవాన్లపై తెగబడి దాడి చేసి .. బహిరంగ ప్రకటన చేసేంతా ధైర్యం ఉగ్రవాద సంస్థకు ఎక్కడిదీ ? ఎవరిచ్చారు ? ఎవరి ప్రోదల్బంతో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. తమ 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్ర మూకలను ఎరివేసేందుకు భారత్ సమాయత్తమైంది. పకడ్బందీ వ్యుహంతో ముందడుగు వేసింది. పాకిస్థాన్ లోని బాలాకోట్, చకోటి, ముజఫర్ నగర్ లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై బాంబుల మోత మోగించింది.

దీంతో ఉగ్రవాదులు, వారికి శిక్షణ ఇచ్చేవారు, జైషే మహ్మద్ చీఫ్ బావమరిది, సోదరుడు నెలమట్టమయ్యారు. కయ్యానికి కాలు దువ్వింది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ .. ఆ సంస్థపై భారత వాయుసేన దాడి చేసింది. ఇంతవరకు ఓకే .. దీనిని ప్రపంచ దేశాలు కూడా అంగీకరించాయి .. స్వాగతించి .. సమర్థించాయి. సాధారణంగా తమకేమి పట్టన్నట్టు ఉండాలి. కానీ అసలే పాకిస్థాన్, అందులో తాను పెంచి పోషిస్తోన్న జైషే సంస్థ అస్థిత్వానికి ప్రమాదం ఏర్పడే దాడితో రగిలిపోయింది. వెంటనే దాడులకు దిగింది. దీనిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.

పాకిస్థాన్ .. ఇవిగో ఆధారాలు ..

పాకిస్థాన్ .. ఇవిగో ఆధారాలు ..

ఐఏఎఫ్ ఫైటర్ల దాడితో రగిలిపోయిన పాకిస్థాన్ .. భారత్ పైకి దాడిచేసేందుకు సిద్ధమయ్యాయి. మొత్తం 24 యుద్ధ విమానాలతో దాడి చేసేందుకు నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించాయి. అయితే మంగళవారం దాడి చేసి .. అప్పటికే సరిహద్దులో భారత త్రివిధ దళాలు అలర్ట్ గా ఉన్నాయి. పాకిస్థాన్ పంపిన 24 విమానాల్లో 3 మిరాజ్, 17 జేఎఫ్ విమానాలు .. ఎఫ్ 16 విమానాలు 4 ఉన్నాయి. భారత్ పై దాడి చేసేందుకు పాకిస్థాన్ పంపించిన యుద్ధ విమానాలు అత్యంత శక్తిమంతమైన మిరాజ్ .. విమానాలు. ఇవి నేల నుంచి గగనతలంలో .. గగనతలం నుంచి గగనతలంలో లక్ష్యాలను చేధించగలదు.

అలాగే ఎఫ్ 16 యుద్ధ విమానాలు కేవలం యుద్ధం కోసం మాత్రమే వాడతారు. నిర్దేశిత లక్ష్యంలో దాడి చేయడంతో దిట్ట. ఏ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేస్తే .. దాయాది దేశంపై దాడికి దిగేందుకు తెగబడటంతో ఆంతర్యం ఏంటీ ? దాడికి దిగి కూడా పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ పూటకో మాట మాట్లాడారు. తొలుత తాము దాడి చేయలేదని .. తర్వాత చేశామని ... భారత్ దాడి చేస్తేనే ప్రతిగా రంగంలోకి దిగామని .. భారత్ కు చెందిన రెండు మిగ్ విమానాలను కూల్చివేశామని మతిలేకుండా మాట్లాడారు. మిగ్ విమానంలో ఇద్దరూ పైలట్లు ఉన్నారని .. ఒక్కరు అభినందన్ అని వీడియో రిలీజ్ చేశారు. మరొకరి ఊసేలేదు. ఇలా సందర్భోచితంగా మీడియా ముందుకొచ్చి నరం లేని నాలికతో నోటికొచ్చినట్టు .. బాధ్యతరహితంగా వ్యాఖ్యానించి అంతర్జాతీయ సమాజంలో పాక్ కు ఉన్న కాస్త పరువును తీసుకున్నారు.

దాయాది .. సాక్ష్యమిదిదో ...

దాయాది .. సాక్ష్యమిదిదో ...

మీడియా ముఖంగా పాకిస్థాన్ చెప్పిన తప్పులను భారత్ ఆధారాలతో సహా బయటపెట్టింది. గురువారం సాయంత్రం ఢిల్లీలో త్రివిధ దళాల అధిపతులు సంయుక్తంగా మీడియా సమావేశంలో పాకిస్థాన్ చేసిన ఆరోపణలను .. నిజనిజాలకు సంబంధించి రుజువులను బయటపెట్టారు. మరో మిగ్ 21 విమానాన్ని భారత్ కోల్పోయిందనే అబద్దపు ప్రచారాలను ఖండించింది. రెండు విమానాలు కూల్చలేదని .. ఇద్దరు పైలట్లను పట్టుకోలేదని, అభినందన్ మాత్రమే పాక్ భూభాగంలో దిగాడని వివరించింది. అలాగే తాము మిగ్ విమానం కోల్పోలేదని .. ఎఫ్ 16 విమానం వాడలేదని తొలుత పాక్ పేర్కొన్నది.

కానీ తర్వాత ఎఫ్ 16 భారత్ అని చెప్పే ప్రయత్నం చేసింది. చివరకు ఎఫ్ 16 విమానం పాకిస్థాన్ దని తేలిపోయింది. దీనికి సంబంధించి ఆధారాలను త్రివిధ దళపతులు ప్రవేశపెట్టారు. పాకిస్థాన్ కు చెందిన ఎఫ్ 16 అని .. కూలిన ప్రదేశంలో లభించిన ఇనుప ధాతువును ప్రపంచానికి చూయించారు.

యోధ .. సెల్యూట్

యోధ .. సెల్యూట్

దాడికి దిగిన యుద్ధ విమానాలను భారత సమర్ధవంతంగా తిప్పికొట్టింది. పాక్ విమానాలను భారత వాయుసేనకు చెందిన 4 సుఖోయ్, రెండు మిరాజ్, రెండు మిగ్ 21 టైసాన్ లు ఉన్నాయి. మిగ్ 21 ఒక దానిని వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నడిపారు. పాకిస్థాన్ కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానంపైకి ఆర్ 73 క్షిపణిని ప్రయోగించాడు. అటు నుంచి పాక్ ఎఫ్ 16 రెండు ఏఎంఆర్ఏఏఎం క్షిపణులు ప్రయోగించడంతో .. అభినందన్ విమానాన్ని తాకింది. ఈ క్రమంలో మిగ్ విమానం పాకిస్థాన్ నేలలో కూలిపోయింది. దీంతో అతను పాక్ చెరలో చిక్కుకున్నాడు. ప్రతిష్టాత్మకం ఎఫ్ 16ను నిలువరించడంతో .. అభినందన్ వర్ధమాన్ యోధుడిగా నిలిచారు. లేదంటే ముష్కర పాకిస్థాన్ దాడితో భారీ నష్టం జరిగే ప్రమాదం ఉండేది. మరో రెండు విమానాల్లో పైలట్లు మాత్రం ఎల్వోసీ అవతల నేలపైకి దిగారు.

English summary
24 attempted to penetrate India through the Line of Control to attack the warplanes. But on Tuesday, the Indian forces were already alert. Of the 24 flights sent by Pakistan, 3 Miraj, 17 JF aircraft, and F 16 planes 4. War planes sent by Pakistan to attack India are the most powerful Miraj. They can break targets in the air from the ground to the breeze. As well as the F-16 fighters are used only for war. Attack on a specific target. What kind of anti-aggression to attack any terrorist camps? Pakistan Army spokesman Ghufur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X