వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐఎస్ చీఫ్ కు చెక్ పెడుతున్న పాకిస్థాన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ అక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో భారత్ సర్జికల్ స్ట్రైక్ దాడులు చేసిన తరువాత పాక్ దూకుడు పెంచింది. పాక్ అక్రమిత కాశ్మీర్ లో భారీగా సైనికులను మొహరిస్తూన్న పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది.

పాక్ అక్రమిత కాశ్మీర్ లో ఉన్న గ్రామాలను పాకిస్థాన్ ఖాళీ చేయించిందని భారత ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ ఎల్వోసీ దగ్గర భారీగా సైనికులను మోహరించిందని భారత సీనియర్ ఆర్మీ అధికారి తెలిపారు.

అసలు మా భూభాగాగంలో ఎలాంటి సర్జికల్ స్ట్రైక్ దాడులు జరగలేదని ఇంతకాలం బుకాయిస్తూ వస్తున్న పాక్ ఇప్పడు అప్రమత్తం అయ్యింది. భారత ఆర్మీ మరో సారి పాక్ లాంచ్ ప్యాడ్స్ మీద దాడి చేసే అవకాశం ఉందని పాకిస్థాన్ భయపడుతుంది.

Pak army build up intensifies on LoC fight

పాక్ ఆర్మీకి నవాజ్ షరీఫ్ వార్నింగ్: చేసింది చాలు మూసుకోండి !

ఈ భయంతోనే పాకిస్థాన్ సరిహద్దులో, పాక్ అక్రమిత కాశ్మీర్ లో భారీగా సైనికులను మోహరిస్తుందని భారత ఇంటిజెన్స్ అధికారులు చెప్పారు. పాక్ ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురు చూస్తుందని అధికారులు గుర్తించారు.

ఇప్పటికే ఎకాకి అయిన పాక్ తమ సైనికులతో భారత్ మీద దాడి చేయిస్తే అంతర్జాతీయం స్థాయిలో ఇంకా వ్యతిరేకత ఎక్కువ అవుతుందని, అందు కోసం ఉగ్రవాదుల రూపంలో ఫిదాయిన్ దాడులు చేయించే అవకాశం ఉందని భారత ఇంటిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

అయితే అంతర్జాతీయ మీడియా కంటపడకుండా ఉండటానికి ఇప్పటికే పాక్ అక్రమితక కాశ్మీర్ లో ఉన్న లష్కరే-ఎ-తోయిబా, జైష్ మహమ్మద్ ఉగ్రవాదుల క్యాంపులను అక్కడి నుంచి ఖాళీ చేయించారని భారత అధికారులు సమాచారం సేకరించారు.

మొత్తం మీద పగతో రగిలిపోతున్న పాకిస్థాన్ ఉగ్రవాదులను రెచ్చగొట్టే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పాక్ సైనికులు భారీగా మోహరించడంతో భారత్ ఆర్మీ అలర్ట్ అయ్యింది. పాక్ పన్నాగాలను తిప్పికొట్టడానికి భారత ఆర్మీ సిద్దంగా ఉంది.

English summary
An intelligence functionary said this could be as the country's establishment fears that Indian Army may hit PoK launch pads adjoining the Jammu region next.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X