• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దిగొచ్చిన పాక్ - కుల్‌భూషణ్ కేసులో కీలక నిర్ణయం - పార్లమెంటులో రచ్చ - ఆంక్షల భయం

|

ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కు మరణశిక్ష విషయంలో దాయాది పాకిస్తాన్ ఎట్టకేలకు దిగొచ్చింది. గూఢచర్యం ఆరోపణలపై జాదవ్ కు పాక్ ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను రివ్యూ చేయాలని, ఆమేరకు అతనికి న్యాయ సహకారం అందేలా చూడాలని అంతర్జాతీయ కోర్టు(ఐసీజే) ఆదేశించడంతో విధిలేని పరిస్థితితుల్లో పాక్ ముందడుగు వేసింది. దీనిపై జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)లో తీవ్రవాదోపవాదాలు నడిచాయి. చివరికి..

ఏపీలో కోరానా: గుడ్‌న్యూస్ - భారీగా తగ్గిన మరణాలు - రికవరీలో దేశంలోనే టాప్ - కొత్తగా 3,620 కేసులుఏపీలో కోరానా: గుడ్‌న్యూస్ - భారీగా తగ్గిన మరణాలు - రికవరీలో దేశంలోనే టాప్ - కొత్తగా 3,620 కేసులు

కుల్‌భూషణ్ జాదవ్ కు ఆర్మీ కోర్టు విధించిన మరణశిక్షను సమీక్షించే బిల్లుకు పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు చేసిన సిఫార్సులను సభ ఆమోదించిందని, తద్వారా తన మరణశిక్షను హైకోర్టులో సవాలు చేసే అవకాశం కుల్‌భూషణ్ కు లభించిందని పాక్ సర్కారు వెల్లడించింది.

Pak Assembly panel approves bill for review of Kulbhushan Jadhavs conviction

నిజానికి జాదవ్ కు న్యాయ సహాయం అందించాలని ఐసీజే గతేడాదే తీర్పు చెప్పినా.. ఆ ప్రక్రియకు ఆటంకాలు సృష్టిస్తూ పాక్ డ్రామాలాడింది. జాదవ్ ను కలవనీయకుండా లాయర్లను అడ్డుకుంది. దీంతో భారత్ మరోసారి ఐసీజేను ఆశ్రయించే ప్రయత్నం చేసింది. మొత్తంగా ఈకేసులో అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను పాటించకపోతే పలురకాల ఆంక్షలు ఎదుర్కోనే పరిస్థితి నెలకొనడంతో పాక్ ఎట్టకేలకు జాదవ్ బిల్లును ఆమోదించింది. కాగా,

జాదవ్ కు మరణశిక్షను సవాలు చేసుకునే అవకాశం కల్పించడంపై పాక్ జాతీయ అసెంబ్లీలో రచ్చ చెలరేగింది. ప్రతిపక్ష ముస్లిం లీగ్ (నవాజ్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, జామాయత్‌ ఉలేమా-ఈ-ఇస్లాం సభ్యులు ఈ బిల్లును వ్యతిరేకించారు. అయితే ఓటింగ్ సమయంలో అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యులు చాకచక్యంగా వ్యవహరించడంతో బిల్లుకు ఆమోదం లభించింది.

కరోనా వ్యాక్సిన్‌పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూకరోనా వ్యాక్సిన్‌పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూ

  Kulbhushan Jadhav తరుపున వాదించేందుకు Indian Lawyers కు అనుమతివ్వని పాక్! || Oneindia Telugu

  అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) సూచనల మేరకు తన మరణ శిక్షను సవాలు చేసుకునే అధికారం జాదవ్ కు కల్పించకపోతే.. ఐసీజే తీర్పును బేఖాతరు చేసినట్లవుతుందని, దాంతో పాక్ ఆంక్షల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని, కాబట్టే సకాలంలో బిల్లును పాస్ చేశామని పాకిస్తాన్ ఫెడరల్ లా అండ్ జస్టిస్ మంత్రి ఫరాగ్ నసీమ్ తెలిపారు.

  English summary
  Pakistan National Assembly's Standing Committee on Law and Justice approved the bill for review of Kulbhushan Jadhav's conviction on Wednesday. Federal Minister for Law and Justice Farogh Naseem said that the bill to review the conviction of Jadhav has been introduced with the directives of the International Court of Justice (Review and Reconsideration) Ordinance, reported Dawn.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X