వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సైనికులు చనిపోతే..‘ఎంజాయ్’ అని పాక్ దూత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉగ్రవాదుల దాడిలో శనివారం జమ్మూ-కాశ్మీర్‌లో 8మంది భారత జవాన్లు మృత్యువాత పడ్డ ఘటనపై న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌కు వివాదాస్పదంగా స్పందించారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో ఇఫ్తార్ విందులో ఉన్న ఆయన.. ఈ దాడిపై స్పందించాలని మీడియా కోరగా తమ దేశ వక్రబుద్ధిని చాటుకున్నారు.

'ఇది రంజాన్ నెల. ఇఫ్తార్ పార్టీ మీద దృష్టిపెడదాం. జమ్మూ-కాశ్మీర్ సమస్యపై భారతదేశం, పాకిస్థాన్ మధ్య వివాదం జరుగుతోంది. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. చర్చించి, పరిష్కారం కనుగొనగలమని ఆశిస్తున్నాం. భారత్, పాకిస్థాన్ సంబంధాల గురించి ఇదివరకే చెప్పాను. ఈరోజు మనం ఇఫ్తార్ ఆనందంగా జరుపుకుందాం.ఇఫ్తార్ పార్టీ చేసుకుని మనం సంతోషిద్దాం' అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.

ఈ ఇఫ్తార్ విందును న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమషన్‌లో శనివారం నిర్వహించారు. ఈ విందులో అబ్దుల్ బాసిత్ కూడా పాల్గొన్నారు. యావత్ ప్రపంచం శాంతియుతంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు బాసిత్ చెప్పారు. భారతదేశం విషయంలో పాకిస్థాన్ విదేశాంగ విధానం కూడా ఇదే స్ఫూర్తిని కనబరుస్తుందన్నారు.

Pak envoy Abdul Basit unfazed by LeT attack in J&K's Pampore, says 'let's enjoy Iftar party'

జవాన్ల మృతి పట్ల మోడీ దిగ్భ్రాంతి

జమ్మూ కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు శనివారం దాడులకు తెగబడ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించుకొని తిరిగివస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 20కిపైగా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన జవాన్లను ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దాడులకు పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదులను సీఆర్పీఎఫ్ జవాన్లు మట్టుబెట్టారు. సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నలిన్ ప్రభాత్, జమ్మూ కశ్మీర్ డీజీపీ కె.రాజేంద్ర సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు లష్కరే తోయిబా గ్రూపుకు చెందిన వారుగా డీజీపీ అనుమానం వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ దుర్గాప్రసాద్ దాడి విషయాలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించారు. కాశ్మీర్‌లో గత మూడు వారాల్లో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడడం ఇది రెండోసారి. బారాముల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం మరోవైపు.. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా లాచిపోరాలో శనివారం ఆర్మీ-ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు.

ప్రధాని దిగ్భ్రాంతి, సంతాపం

కాశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతిపై ప్రధానిమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమరులైన జవాన్ల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. దేశానికి ఎంతో అంకితభావంతో సేవలు చేశారని ట్వీట్ చేశారు. అమరుల కుటుంబాలకు సంతాపం ప్రకటించడంతో పాటు, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

English summary
Pakistan has done it again. It has proved once more that this country is least serious about it's own home-grown terrorism. To prove it, Pakistan High Commissioner to India Abdul Basit on Saturday gave a very loose statement over the terror attack in J&K's Pampore area in which eight CRPF jawans were martyred today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X