వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ ప్రోద్బలంతో భారత్ లో ఉగ్రదాడులకు భారీ కుట్ర .. పీవోకేలో రెండు సార్లు సమావేశం అందుకే !!

|
Google Oneindia TeluguNews

భారతదేశానికి ఉగ్రదాదుల ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే భారతదేశం ఒకపక్క చైనాతో తలపడుతుంటే మరోవైపు పాకిస్తాన్ కుట్రలకు తెర తీసింది . ఇండియాపై ఉగ్రపంజా విసరనుంది అన్న వార్త ఇప్పుడు టెన్షన్ పుట్టిస్తుంది. దేశంలో ఉగ్ర దాడులే లక్ష్యంగా పాక్ ఇంటలిజెన్స్, ఉగ్ర మూకలు కలిసి పక్కా ప్లాన్ రూపొందిస్తున్నట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి.

Recommended Video

BREAKING: Chinese Soldier Captured By Indian Army in Ladakh | India-China Faceoff

భారత భద్రతాదళాల దెబ్బకు సెప్టిక్ ట్యాంకుల్లో దాక్కుంటున్న ఉగ్రవాదులుభారత భద్రతాదళాల దెబ్బకు సెప్టిక్ ట్యాంకుల్లో దాక్కుంటున్న ఉగ్రవాదులు

పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐఎస్ఐ ఉగ్ర నేతల సమావేశం .. దాడుల కోసం

పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐఎస్ఐ ఉగ్ర నేతల సమావేశం .. దాడుల కోసం

కరెన్ సెక్టార్ కు ఎదురుగా భారీగా ఉగ్రవాదుల కదలికలు గుర్తించినట్లుగా నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. జైష్ ఎ మొహమ్మద్ ,లష్కరే తోయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు నీలం లోయ వద్ద ఉన్నారని, భారత్ లోకి వారు చొరబాటు కు అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లుగా నిఘా సంస్థలు తెలిపాయి. అంతేకాదు సుజియాన్ ప్రాంతంలో కూడా 40 మంది ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లుగా నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఐఎస్ఐ ఉగ్ర నేతలు ఇప్పటికి రెండు సార్లు సమావేశమైనట్లుగా నిఘా వర్గాలు హెచ్చరించాయి.

 ఈ నెలలో రెండు సార్లు సమావేశం అయిన ఉగ్రవాదులు .. ఇంటిలిజెన్స్ హెచ్చరిక

ఈ నెలలో రెండు సార్లు సమావేశం అయిన ఉగ్రవాదులు .. ఇంటిలిజెన్స్ హెచ్చరిక

శీతాకాలానికి ముందే భారత్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేశారని , అయితే భారత్ కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ మధ్య వారు దాడులకు పాల్పడ్డారని కి సాధ్యం కాలేదని ఇంటెలిజెన్స్ చెబుతోంది. మరోవైపు ఈ నెల 4 , 7వ తేదీల్లో పీవోకేలో రెండు సార్లు సమావేశం జరిగినట్లుగా పేర్కొన్న నిఘా వర్గాలు ఒక దాడికి 26 లక్షలు, పెద్ద ఆపరేషన్ కోసం 30 లక్షలు ఇచ్చినట్లుగా చెప్తున్నాయి. భారత నియంత్రణ రేఖ వెంట 250 నుండి 300 మంది ఉగ్రవాదులు చొరబడేందుకు అవకాశముందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది.

నీలం లోయ సమీపంలో చొరబాట్లకు యత్నం .. అలెర్ట్ అయిన ఆర్మీ

నీలం లోయ సమీపంలో చొరబాట్లకు యత్నం .. అలెర్ట్ అయిన ఆర్మీ

నీలం లోయ సమీపంలోని తంగ్ధర్ సెక్టార్ లో ఉగ్రవాదుల చొరబాట్లకు ప్రణాళికలు వేసినట్లుగా తెలుస్తోంది. పాక్ ఆర్మీ సమక్షంలోనే, వారి ప్రోద్బలంతోనే ఉగ్రదాడులకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పరిచి, ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టింది. ఎక్కడికక్కడ ఏరివేత కార్యక్రమాలు మొదలు పెట్టింది. ఇప్పటికే పలు ఉగ్ర స్థావరాలను కనిపెట్టిన ఆర్మీ ఎన్ కౌంటర్లతో ఉగ్రవాదులను అంతమొందిస్తుంది .

English summary
The army has been put on high alert following intelligence inputs about a probable terror attacks in india , Intelligence agencies have alerted on the possibility of terrorists entering and they were met for two times in this month for attacks . pakisthan army supporting the terror groups to enter in india .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X