వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: జవాన్ల మృతదేహాలు తీసుకెళ్లేందుకు తెల్లజెండా ఎగురవేసిన పాక్

|
Google Oneindia TeluguNews

Recommended Video

జవాన్ల మృతదేహాలు తీసుకెళ్లేందుకు తెల్లజెండా ఎగురవేసిన పాక్ (వీడియో)

న్యూఢిల్లీ : సెప్టెంబర్ 11న పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందంకు తూట్లు పొడుస్తూ ఆ దేశ సైనికులు భారత్‌పైకి కాల్పులు జరిపారు. దీనికి ప్రతీకార చర్యగా భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికులు మృతి చెందారు. ఈ ఇద్దరి పాక్ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ సైన్యం వచ్చింది. ఈ దృశ్యాలు కలిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక భారత జవాన్లు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన పాక్ సైనికుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు సరిహద్దుకు వచ్చిన సైన్యం ముందుగా తెల్లజెండాను ఎగురవేసింది. తెల్ల జెండా ఎగురవేసి ఆ పై మృతదేహాలు తీసుకెళుతున్న దృశ్యాలను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ సైన్యంకు చెందిన సిపాయి గులామ్ రసూల్ మృతి చెందినట్లు సమాచారం. ఇతను పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం బాహవల్‌నగర్‌కు చెందిన వాడిగా గుర్తించారు. ఈ ఘటన పీఓకేలోని హాజీపూర్ సెక్టార్ వద్ద చోటుచేసుకుంది.

 Pak raises white flag to recover the dead bodies of its Jawans

ముందుగా భారత్‌పైకి కాల్పులు జరుపుతూనే మృతదేహాలను రికవర్ చేసుకోవాలని పాకిస్తాన్ సైన్యం భావించింది. అయితే మొదటి మృతదేహం స్వాధీనం చేసుకునే సమయంలో భారత్ జరిపిన కాల్పుల్లో మరో జవాను మృతి చెందాడు. ఇక కాల్పులు జరిపి మృతదేహాలను స్వాధీనం చేసుకోవాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమైన పాకిస్తాన్ చివరకు తెల్లజెండాను ఎగురవేసి మృతదేహాలను తీసుకెళ్లింది. కీరాన్ సెక్టార్‌లో కూడా జూలై 30-31న భారత్ జరిపిన కాల్పుల్లో పాక్ జవాన్లు మృతి చెందగా వారి మృతదేహాలను స్వాధీనం చేసుకోలేదు. కార్గిల్‌ యుద్ధ సమయంలో కూడా మృతి చెందిన పాక్ సైనికులను తీసుకెళ్లడంలో పాక్ ఆసక్తి చూపలేదు.దీంతో వారి అంత్యక్రియలను భారత ఆర్మీనే నిర్వహించింది.

English summary
Pakistani Army on Friday raised a white flag at the Line of Control (LoC) to retrieve bodies of two of its soldiers killed by the Indian Army in retaliation to unprovoked ceasefire violation on September 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X