వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధైర్యం చేసిన పాక్ సింగర్: భారత్ దాడులకు సపోర్ట్

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారత్ చేసిన సర్జికల్ దాడులను పాకిస్తాన్ గాయకుడు అద్నాన్ సమీ మద్దతు తెలిపారు. భారత సైన్యం తెగువను ప్రశంసించే ధైర్యం చేశారు. బాలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ అతను పాటలు పాడారు. ఆయన పాటలకు మంచి స్పందన కూడా వచ్చింది..

పాకిస్తాన్ దేశస్తుడైన అద్నాన్ సింగర్‌గా మాత్రం భారతదేశంలోనే విజయాలు సాధించారు. దాంతో ఆయన ఇక్కడే స్థిరపడ్డారు. భారత్‌కు మద్దతు తెలిపిన అద్నాన్‌పై పెద్ద యెత్తున విమర్శలు తలెత్తాయి. ఈ విమర్శలకు కూడా ఆయన ఘాటుగా సమాధానాలు ఇచ్చారు. పాకిస్తాన్‌ను, ఉగ్రవాదాన్ని వారు ఒకే రకంగా చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

భారత్ సర్జికల్ దాడులను సమర్థిస్తూ అద్నాన్ ట్విట్టర్‌లో పోస్టు చేయగానే భారతీయులు ఆనందపడిపోయి ట్విట్టర్‌లోనూ ఫేస్‌బుక్‌లోనూ తమ అభినందనల వ్యాఖ్యలను పెట్టారు. సర్జికల్ దాడులకు అద్నాన్ ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తూ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

అయితే, ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అద్నాన్ సమీ 2015లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడుట. పాకిస్తాన్ పాస్‌పోర్టు గడువు ముగిసి, దాన్ని రెన్యూవల్ చేయకపోవడంతో ఆయన ఆ పని చేశారు.

పిఎఎఫ్ పైలట్ కుమారుడు అయి ఉండి భారత పక్షం తీసుకోవడమేమిటని ఆయన ప్రశ్నించినవారు కూడా ఉన్నారు. ప్రస్తుత వాతావరణంలో అద్నాన్ కూడా భారతీయుల నుంచి ఒత్తిడిని ఎదుర్కున్నారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఫవాద్ ఖాన్, అలీ ఫజల్, మహీరా ఖాన్‌తో పాటు సమీని కూడా బహిష్కరిస్తామని ఎంఎన్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Singer Adnan Sami too, joined in the revelry and took to Twitter to write this congratulatory post addressing the Prime Minister: Big Congratulations to PMOIndia & our brave Armed forces for a brilliant, successful & mature strategic strike against #terrorism ! #Salute
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X