వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభినందన్ రిలీజ్‌పై షరతులకు నో: పాకిస్తాన్‌కు భారత్ స్పష్టమైన సందేశం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను విడుదల చేయాలని పాకిస్తాన్‌లోని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ కేవలం ఉగ్రవాద శిబిరాల పైనే దాడి చేయడం, అంతర్జాతీయస్థాయిలో ఒత్తిడి, కనీసం చైనా అండ కూడా లేకపోవడం, భారత్ పలు దేశాలతో సంప్రదింపులు జరపడం తదితర కారణాలతో పాక్ ఇరుకున పడింది. ఎట్టకేలకు అభినందన్‌ను విడుదల చేస్తామని గురువారం ప్రకటించింది. అయితే అంతకుముందే భారత్.. పాక్‌కు ఓ స్పష్టమైన సందేశం ఇచ్చింది.

మేం ఉగ్రవాదులను టార్గెట్ చేస్తే, పాక్ భద్రతాదళాలను టార్గెట్ చేసింది

మేం ఉగ్రవాదులను టార్గెట్ చేస్తే, పాక్ భద్రతాదళాలను టార్గెట్ చేసింది

కమాండర్ అభినందన్‌ను విడుదల చేసేందుకు కాందహార్ తరహా మాదిరిగా చేయాలని పాకిస్తాన్ భావిస్తే, అలాంటివి కుదరదని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ విషయంలో తాము ఎలాంటి కన్సులర్ యాక్షన్ కావాలని కోరుకోవడం లేదని, బేషరతుగా అతనిని సురక్షితంగా తిరిగి అప్పగించాలని మాత్రం డిమాండ్ చేస్తున్నామని భారత్ స్పష్టం చేసింది. తాము జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా తాము దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం తమ భద్రతా దళాలను లక్ష్యంగా చేసేందుకు ప్రయత్నించిందన్నారు.

 తగ్గని భారత్.. అప్పుడే చర్చలు

తగ్గని భారత్.. అప్పుడే చర్చలు

ఇరుదేశాల మధ్య నెలకొన్ని పరిస్థితులు సద్దుమణిగే వరకు పాకిస్తాన్ ప్రధాని చర్చలకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారని, కానీ అలాంటి చర్చలు జరగాలంటే పాక్ ముందుగా ఉగ్రవాద నియంత్రణ చర్యలు చేపట్టాలని, ముష్కరులను అణిచివేసేందుకు తక్షణమే, సరైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అప్పుడే చర్చలు జరుగుతాయని పేర్కొంది. ఇదే పాకిస్తాన్‌కు తామిచ్చే సందేశమని చెప్పారు. పౌరులు, సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని తాము ఎలాంటి దాడులు చేయలేదని, కానీ పాకిస్థాన్‌ మాత్రం భారత్‌ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోందన్నారు.

మీ బ్లాక్ మెయిల్ అంగీకరించే ప్రసక్తి లేదు

మీ బ్లాక్ మెయిల్ అంగీకరించే ప్రసక్తి లేదు

వింగ్‌ కమాండర్ అభినందన్‌ను అడ్డం పెట్టుకొని పాకిస్తాన్ బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ప్రయత్నిస్తే అందుకు ఎంతమాత్రం అంగీకరించమని భారత్ తెలిపింది. అభినందన్‌ను వెంటనే సురక్షితంగా భారత్‌ తిరిగి పంపించాలని, పాకిస్తాన్ కాందహార్‌ తరహా వ్యూహం తమపై తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోందని, కానీ తాము అందుకు అంగీకరించేది లేదని, వింగ్‌ కమాండర్‌ను విడిచి పెట్టే విషయంలో ఎటువంటి డీల్ లేదా చర్చలను అంగీకరించేది లేదని భారత్ పేర్కొంది. (ఆ తర్వాత పాకిస్తాన్ మన కమాండర్‌ను విడుదల చేసేందుకు అంగీకరించింది)

అంతర్జాతీయ వేదికగా పాక్ అబద్దాలు

అంతర్జాతీయ వేదికగా పాక్ అబద్దాలు

జైష్ ఎ మహ్మద్ గురించి పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికగా అబద్ధాలు చెబుతోందని భారత్‌ మండిపడింది. పాకిస్తాన్ తొలుత ఇద్దరు పైలట్లు ఉన్నారని చెప్పిందని, సాయంత్రం వరకు మాట మార్చిందని, ఒక పైలట్ మాత్రమే ఉన్నాడని చెప్పిందని భారత్ గుర్తు చేసింది. అంతేకాకుండా పాకిస్తాన్ గగనతలాన్ని మూసేసి, సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొంది.

English summary
Government sources in India on Thursday said that Pakistan is trying to create a Kandahar type pressure after the capture of the Indian pilot but New Delhi will not make any deal on the matter and wants immediate release of the Indian Air Force personnel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X