వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్ బరితెగింపు: కరోనా రోగులను భారత్‌లోకి పంపిస్తోంది!

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్/న్యూఢిల్లీ: ప్రపంచమంతా కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటుంటే.. పాకిస్థాన్ మాత్రం ఆ మహమ్మారిని కూడా ఉగ్రవాదానికి ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తరచూ ఉగ్రవాదులను పంపే పాకిస్థాన్.. ఇప్పుడు భారతదేశంలోకి కరోనా పేషంట్లను పంపుతోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన వివరాలను జమ్మూకాశ్మీర్ డీజీపీ వెల్లడించారు.

ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ!ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ!

భారత్‌లో కరోనా వ్యాప్తి ఇలా..:, 28 రోజులుగా 12 జిల్లాల్లో, 14 రోజుల్లో 78 జిల్లాల్లో కేసుల్లేవ్..భారత్‌లో కరోనా వ్యాప్తి ఇలా..:, 28 రోజులుగా 12 జిల్లాల్లో, 14 రోజుల్లో 78 జిల్లాల్లో కేసుల్లేవ్..

జమ్మూకాశ్మీర్‌లోకి..

జమ్మూకాశ్మీర్‌లోకి..

కరోనావైరస్ సోకిన వ్యక్తులను జమ్మూకాశ్మీర్ లోయలో తరలించేందుకు పాక్ ప్రయత్నిస్తోందని డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు. శ్రీనగర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాందెర్ బాల్ జిల్లాలో కరోనావైరస్ క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన సందర్భంగా డీజీపీ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

కరోనా రోగులతో ఉగ్రవాదం..

కరోనా రోగులతో ఉగ్రవాదం..

ఇప్పటి వరకు ఉగ్రవాదులను తరలిస్తున్న పాకిస్థాన్.. తాజాగా కరోనా రోగులను కాశ్మీర్‌లోకి చేరవేస్తోందని అన్నారు. కాశ్మీర్‌లో కరోనావైరస్ వ్యాప్తి చేసేందుకే ఇలాంటి ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమైన సమాచారం ఉందని డీజీపీ తెలిపారు. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) నుంచి భారతదేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు.

అప్రమత్తంగా ఉండాలంటూ..

అప్రమత్తంగా ఉండాలంటూ..


ఈ పరిణామాల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని భద్రతా దళాలకు డీజీపీ సూచించారు. కాగా, ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన నిఘా సమాచారం ఉందని వారం క్రితమే భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణే ప్రకటించారు.
కాగా, ఇప్పటి వరకు జమ్మూకాశ్మీర్‌లో 400 కరోనా కేసులు నమోదయ్యాయి. పీవోకేలో 50 మందికిపైగా కరోనా బారినపడిట్లు అధికారులు తెలిపారు.

పాకిస్థాన్‌లో కరోనా పట్ల నిర్లక్ష్యం

పాకిస్థాన్‌లో కరోనా పట్ల నిర్లక్ష్యం


పాకిస్థాన్ లో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దాయాది దేశంలో 10,513 కరోనా కేసులు నమోదు కాగా, 224 మంది మరణించారు. ఇటీవల కరోనా సోకిన వ్యక్తితో కరచాలనం చేసిన పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా క్వారంటైన్ అయిన విషయం తెలిసిందే. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ రావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. దేశంలో కరోనా వ్యాపిస్తున్నప్పటికీ లాక్ డౌన్ లాంటి కఠిన చర్యలు తీసుకోకుండా రంజాన్ వేడుకలను జరుపుకోవచ్చంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. అంతేగాక, ఇటీవల ప్రపంచం కళ్లు గప్పి 1800 మంది ఉగ్రవాదులను దాచే ప్రయత్నం కూడా చేసింది ఈ పాపిస్థాన్.

Recommended Video

ICC Test Rankings : Virat Kohli Retains The Top Spot, Babar Azam Achieves Career Best Position

English summary
DGP Dilbag Singh said that Pakistan is trying to export coronavirus patients in Jammu and Kashmir. “It’s is a matter of investigation that Pakistan who used to export terrorist in Jammu and Kashmir, now will export coronavirus patients here,” said Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X