వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మారని దాయాది వైఖరి: కాల్పుల విరమణ ఒప్పందానికి యధేచ్చగా తూట్లు

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ యదేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. సరిహద్దులో కాల్పులు జరుపుతూ కవ్విస్తోంది. కశ్మీర్ విభజన తర్వాత కవ్వింపు చర్యలు ఎక్కువయ్యాయి. పాకిస్థాన్ ఉగ్ర మూకల దాడులను భద్రతా దళాలు ధీటుగా తిప్పికొట్టాయి. ఆదివారం కూడా కవ్వించగా భద్రతా దళాలు ధీటుగా తిప్పికొట్టాయి.

పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి ఆదివారం పాకిస్థాన్ కాల్పుల జరిపిందని కశ్మీర్ పోలీసులు తెలిపారు. పాకిస్థాన్ దాడి చేయగా భారత బలగాలు ధీటుగా తిప్పికొట్టాయని పేర్కొన్నారు. గత కొన్నాళ్ల నుంచి కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ తూట్లు పొడుస్తుందని కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్ర మూకల ఆట కట్టించినట్టు ఆయన తెలిపారు.

Pak violates ceasefire at LoC in Poonch

యూరీ, రాజౌరి, పూంచ్ జిల్లాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది. దీంతోపాటు ఉగ్ర మూకలు చొరబడ్డారని డీజపీ పేర్కొన్నారు. ఉగ్ర మూకల చొరబాటుతో ఇప్పటికే అప్రమత్తమయ్యాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 300 చొరబాట్లు జరిగాయని చెప్పారు. మరోవైపు కశ్మీర్‌లో పరిస్థితి దృష్ట్యా రహదారులపై ఆంక్షలు ఎత్తివేశామని తెలిపారు. మార్కెట్లు తెరుచుకోవడంతో జనం నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారని తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఆంక్షలను పూర్తిస్థాయిలో సడలిస్తామని ఆయన తెలిపారు.

English summary
pakistan violated the ceasefire at the Line of Control (LoC) in Poonch district of Jammu and Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X