వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ బిల్లుపై పాకిస్తాన్ వాదననే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో వినిపిస్తోంది : అమిత్ షా

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ బిల్లుపై రాజ్యసభలో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలోనే సభ్యులు అడిగిన ప్రశ్నలు హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పారు. ఈనేపథ్యంలోనే ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

ఈ బిల్లుపై చర్చలో కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. పౌరసత్వ బిల్లుపై పాకిస్థాన్ మరియు కాంగ్రెస్ పార్టీ ఒకేవిధంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. నిన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ మాదిరిగానే నేడు లోక్‌సభలో కూడ కాంగ్రెస్ సభ్యులు మాట్లాడుతున్నారని అన్నారు.మరోవైపు ఈ బిల్లును యాబై సంవత్సరాల క్రితమే తీసుకువచ్చినట్టైతే... ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాము ఈ బిల్లును 2015లోనే తీసుకువచ్చామని ,లోక్‌సభలో కూడ అమోదం పోందిదని చెప్పారు. ఇక జేపీసీ అమోదం కూడ లభించిందని అన్నారు.

Pakistan and Congress are speaking the same language ; Amit Shah

ఈనేపథ్యంలోనే ప్రజల దృష్టిని మరల్చేందుకు బిల్లును తీసుకువస్తుందన్న గులాంనబి అజాద్ ఆరోపణలకు అమిత్ షా సమాధానం చెప్పారు. తాము రాజకీయంగా ఎలాంటి లబ్ధి పోందేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదని, తాము తమ నాయకుడిని బలంపైనే ఎన్నికల్లో గెలిచే సత్తా ఉందని ఆయన అన్నారు. ఇక ప్రస్తుత సభ్యులు ముల్సింలను ఎందుకు చేర్చలేదనే అంశంపై దృష్టి సారించాలని ఆయన కోరారు. కాగా సవరణ బిల్లులో ముస్లింలను కాకుండా ఇతర ఆరు మతాలకు చెందిన వారికి పౌరసత్వ బిల్లులో అవకాశం కల్పిస్తున్నామని అమిత్ షా చెప్పారు.

English summary
Amit Shah replies to questions of Parliamentarians in Rajya Sabha.he says Pakistan and Congress are speaking the same language.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X