వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత భద్రతా బలగాలపై పాక్‌ కాల్పులు: ఇద్దరు జవాన్లు మృతి

బుధవారం పాక్‌ సైన్యం జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కెరన్‌ సెక్టార్‌లో భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. బుధవారం పాక్‌ సైన్యం జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కెరన్‌ సెక్టార్‌లో భారత భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడింది.

ఈ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది హతమార్చిన మరుసటి రోజే పాక్‌ సైన్యం నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు పాల్పడడం గమనార్హం.

two-jawans-dead

అంతకుముందు ఫూంచ్‌ సెక్టార్‌ వెంబడి ఉన్న గ్రామాలపై పాక్‌ సైన్యం మోర్టార్లతో దాడికి దిగింది. జూన్‌ నెలలో పాక్‌ దాదాపు 23 సార్లు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడింది.

ఈ కాల్పుల ఘటనల్లో నలుగురు పౌరులు, ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది గాయపడ్డారు. భారత జవాన్లపై తాజాగా జరిపిన కాల్పుల వెనుక ఉన్నది పాకిస్తాన్ అర్మీనా లేక పాకిస్తాన్ కు చెందిన బార్డర్ యాక్షన్ టీం(బాట్)నా అన్నది తెలియరాలేదు.

English summary
Two Indian Army jawans from 5 Jammu & Kashmir Rifles were martyred in a sniper shootout near the Line of Control (LoC) in north Kashmir. It is believed Pakistani troops targeted two army jawans near Furkian Gali of Keran sector in Kupwara district. It is not yet clear whether the jawans were fired by Pakistani troops or Pakistan's Border Action Team (BAT). Furkiya area has been a known route used by militants infiltrating into the Kashmir Valley from Pakistan. Further details about the attack are awaited.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X